ప్రియురాలితో రానా పెళ్లి... ముందే చెప్పిన చిరంజీవి

రానా అనౌన్స్‌మెంట్‌కు సంబంధించి వారి ఫ్యామిలీ నుంచి కాకుండా... మెగాస్టార్ చిరంజీవి వైపు నుంచి ఫుల్ క్లారిటీ వచ్చిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

news18-telugu
Updated: May 12, 2020, 10:08 PM IST
ప్రియురాలితో రానా పెళ్లి... ముందే చెప్పిన చిరంజీవి
చిరంజీవి, రానా
  • Share this:
టాలీవుడ్ యంగ్ స్టార్ రానా ట్విట్టర్ ద్వారా తన ప్రియురాలి ఎస్ చెప్పింది అంటూ అనౌన్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంతోమంది హీరోయిన్లతో రానాకు లవ్ ఎఫైర్లు ఉన్నాయనే పుకార్లు వినిపించాయి. అయితే ఈ దగ్గుబాటి వారి అబ్బాయి మాత్రం వాటిపై ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. కానీ తాజాగా తన ప్రియురాలు మిహీకా బజాజ్ అంటూ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. అంతేగాక మిహీకాతో దిగిన సెల్ఫీ ఫొటోను కూడా షేర్ చేస్తూ.. ‘ఆమె నాకు ఎస్ చెప్పింది’ అని తెలిపారు. అయితే రానా గర్ల్‌ఫ్రెండ్ అతడితో ప్రేమకు ఓకే చెప్పిందా ? లేక పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ? అనే విషయం మాత్రం చాలామందికి అర్థంకాలేదు.

రానా సైతం ఓ టీజర్ తరహాలో స్టేట్’మెంట్ ఇవ్వడంతో ఆ సస్పెన్స్ అలా కొనసాగింది. అయితే రానా అనౌన్స్‌మెంట్‌కు సంబంధించి వారి ఫ్యామిలీ నుంచి కాకుండా... మెగాస్టార్ చిరంజీవి వైపు నుంచి ఫుల్ క్లారిటీ వచ్చిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ట్విట్టర్‌లోని ఎంట్రీ ఇచ్చి చాలా అంశాలపై స్పందిస్తున్న చిరంజీవి... రానా ఇష్యూపై కూడా రియాక్ట్ అయ్యారు. కంగ్రాట్స్ మై బాయ్.. అరివీర భల్లాలదేవ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు అన్నమాట అంటూ కామెంట్ చేశారు. ఈ లాక్ డౌన్ ఓ రకంగా మంచే చేసింది నీకు వెడ్డింగ్ లక్ తీసుకొచ్చింటూ అశీర్వదించారు. రానాకు చిరంజీవి కుమారుడు, స్టార్ హీరో రామ్ చరణ్‌కు మధ్య చిన్ననాటి నుంచే స్నేహం ఉంది. ఈ స్నేహం కారణంగానే రానా ప్రేమ వ్యవహారం, పెళ్లిపై చిరంజీవికి పూర్తి సమాచారం ఉండి ఉంటుందని... అందుకే ఆయన ఈ రకంగా రానా మ్యారేజ్ విషయాన్ని అందరికంటే ముందే లోకానికి చెప్పేశారనే టాక్ వినిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: May 12, 2020, 10:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading