Bigg Boss 3: బిగ్‌బాస్ 3 ఫైనల్స్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి..

తెలుగు టెలివిజన్ లో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ తన హోస్టింగ్‌తో రక్తి కట్టిస్తే.. రెండో షోను తనదైన శైలిలో గెలుపు తీరాలకు చేర్చాడు నాని. ఇక మూడో సీజన్‌ను నాగార్జున ఎంతో ఎనర్జీతో ఫుల్ స్వింగ్‌లో చేస్తున్నాడు. తాజాగా రోజు  బిగ్‌బాస్ ఫినాలేకు చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేసారు.

news18-telugu
Updated: November 3, 2019, 8:59 PM IST
Bigg Boss 3: బిగ్‌బాస్ 3 ఫైనల్స్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి..
చిరంజీవి (Facebook/Photo)
  • Share this:
తెలుగు టెలివిజన్ లో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ తన హోస్టింగ్‌తో రక్తి కట్టిస్తే.. రెండో షోను తనదైన శైలిలో గెలుపు తీరాలకు చేర్చాడు నాని. ఇక మూడో సీజన్‌ను నాగార్జున ఎంతో ఎనర్జీతో ఫుల్ స్వింగ్‌లో చేస్తున్నాడు. తాజాగా రోజు  బిగ్‌బాస్ ఫినాలేకు చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేసారు. మొదట మారుతి, రాశిఖన్నా వచ్చారు.ఆ తర్వాత శ్రీకాంత్, కేథరిన్ వచ్చారు. ఆ తర్వాత అంజలి హౌస్‌ లోపలి వెళ్లింది. బిగ్‌బాస్ మొదట హౌస్ నుండి స్వచ్ఛందంగా బయటకు వెళ్లే వారికి రూ. 10 లక్షల ఆఫర్ ప్రకటించాడు. ఆ తర్వాత రూ.25 లక్షలు ప్రకటించాడు. అయినా ఎవరు ఈ ఆఫర్‌కు స్పందించలేదు. ఆ తర్వాత మూడో కంటెస్టెంట్‌ అయిన బాబా భాస్కర్‌ను అంజలి హౌస్ నుండి బయటకు తీసుకెళ్లింది. ఫైనల్ ఇద్దరు శ్రీముఖి, రాహుల్‌లో ఎవరు విజేతలనే విషయాన్ని తేల్చడానికి చిరంజీవి బిగ్‌బాస్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసారు. చిరంజీవి చేతులు మీదుగా బిగ్‌బాస్ 3 తెలుగు విజేతకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. 

First published: November 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు