Chiranjeevi Uppena: నేను చెప్పింది చేయండి.. ‘ఉప్పెన’ విషయంలో మైత్రి నిర్మాతలకు చిరంజీవి వార్నింగ్..

చిరంజీవి ఉప్పెన (Chiranjeevi Uppena)

Chiranjeevi Uppena: నిజమే.. నిజంగానే ఉప్పెన సినిమా విషయంలో మైత్రి మూవీ మేకర్స్ అధినేతలకు చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడు.. చిన్నపాటి వార్నింగ్ కాదది.. చెప్పినట్లు చేయకపోతే ఇకపై ఏ సినిమాను ముట్టుకోను.. పట్టించుకోను అంటూ ఛాలెంజ్ చేసాడు.

  • Share this:
నిజమే.. నిజంగానే ఉప్పెన సినిమా విషయంలో మైత్రి మూవీ మేకర్స్ అధినేతలకు చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడు.. చిన్నపాటి వార్నింగ్ కాదది.. చెప్పినట్లు చేయకపోతే ఇకపై ఏ సినిమాను ముట్టుకోను.. పట్టించుకోను అంటూ ఛాలెంజ్ చేసాడు. ఈ విషయం కూడా ఎవరో చెప్పింది కాదు మైత్రి ముగ్గురు నిర్మాతల్లో ఒకరైన నవీన్. అసలు విషయం ఏంటంటే.. ఈ రోజు ఉప్పెన సినిమా చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం 5 రోజుల్లోనే 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను 20 కోట్ల లోపే పూర్తి చేసింది. అంతేకాదు బిజినెస్ కూడా 21 కోట్ల వరకు చేసింది. చాలా వరకు సొంతంగా ఈ సినిమాను విడుదల చేసుకున్నారు. కథపై నమ్మకంతో ఎవరికీ అమ్మలేదు. దాంతో ఇప్పుడు లాభాలు కూడా భారీగానే వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మైత్రి మూవీ మేకర్స్‌కు వరస ఫ్లాపులు వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు ఉప్పెన తీసుకొస్తున్న లాభాలతో గత సినిమాల నష్టాలన్నీ పటాపంచలు అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఉప్పెన ఈ రోజు ఇంతటి సంచలనం సాధించడానికి చిరంజీవి కారణం. అసలేం జరిగిందంటే ఉప్పెన కథ ముందుగా చిరంజీవికే చెప్పారు. మేనల్లుడి ఎంట్రీ కోసం చిరు కూడా అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. ఈ కథ చెప్పినపుడు క్లైమాక్స్ విషయంలో చిరంజీవి బాగా ఎగ్జైట్ అయ్యాడు.

chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi uppena movie,chiranjeevi mythri movie makers warning,chiranjeevi mythri movie makers uppena movie,telugu cinema,uppena movie collections,chiranjeevi uppena movie collections,ఉప్పెన,చిరంజీవి ఉప్పెన,మైత్రి మూవీ మేకర్స్‌కు చిరంజీవి ఉప్పెన విషయంలో వార్నింగ్
ఉప్పెన టీమ్‌తో చిరంజీవి (Chiranjeevi)


అదే సినిమాను నడిపిస్తుందని.. చరిత్ర సృష్టించేలా చేస్తుందని ముందు నుంచి కూడా బలంగా నమ్మాడు మెగాస్టార్. అదే విషయం దర్శక నిర్మాతలకు కూడా చెప్పాడు. సినిమా అయిపోయిన తర్వాత ప్రివ్యూ చూసినపుడు కూడా చిరు ఇదే మాట చెప్పాడు. రేపు సినిమా విడుదలైన తర్వాత కచ్చితంగా మీ ఊహకు కూడా అందని కలెక్షన్స్ సాధిస్తుందని.. మీరు తొందరపడి సినిమాను అమ్మేయొద్దు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు నిర్మాత నవీన్. ఇప్పుడు చిరు చెప్పినట్లుగానే జరుగుతుందని చెప్పాడు ఈయన.

chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi uppena movie,chiranjeevi mythri movie makers warning,chiranjeevi mythri movie makers uppena movie,telugu cinema,uppena movie collections,chiranjeevi uppena movie collections,ఉప్పెన,చిరంజీవి ఉప్పెన,మైత్రి మూవీ మేకర్స్‌కు చిరంజీవి ఉప్పెన విషయంలో వార్నింగ్
ఉప్పెన టీమ్‌తో చిరంజీవి (Chiranjeevi)


ఉప్పెన విజయంలో చిరంజీవి పాత్ర మరవలేం అని.. ఆయన అనుభవం సినిమాకు పనికొచ్చిందని చెప్పాడు ఈయన. అంతేకాదు తాను చెప్పింది జరక్కపోతే ఇకపై సినిమాలకు జడ్జిమెంట్ కూడా ఇవ్వనని.. తన తీర్పు తప్పు అని ఒప్పుకుని దూరంగా ఉంటానని చెప్పాడు మెగాస్టార్. ఆయన అంత నమ్మకంగా చెప్పినందుకే ఉప్పెనను ఎవరికీ అమ్మకుండా సొంతంగా విడుదల చేసామని చెప్పాడు మైత్రి నిర్మాత నవీన్. ఏదేమైనా కూడా మెగాస్టార్ ఇన్నేళ్ళ అనుభవం ఉప్పెన సినిమాకు బాగా పనికొచ్చిందన్నమాట.
Published by:Praveen Kumar Vadla
First published: