Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI CELEBRATING SANKRANTHI WITH HIS FAMILY SNR

కొణిదెల వారింట్లో సంతోషాలకు కొదవేలేదు..కుటుంబ సభ్యులకు అట్లు వేసిన అగ్రహీరో

Photo Credit :Instagram

Photo Credit :Instagram

Mega Family: మెగాస్టార్‌ చిరంజీవి కాంపౌండ్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. కుటుంబ సభ్యులంతా చిరంజీవి నివాసంలో సందడి చేశారు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చిరంజీవి భోగి రోజు అట్లు వేసి తినిపించారు. అటుపై సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.

ఇంకా చదవండి ...
టాలీవుడ్‌కి మెగాస్టార్‌ అయినా..ఫ్యామిలీలో మాత్రం ఓ చిన్నపిల్లాడిలా మారిపోతారు చిరంజీవి. కుటుంబ సభ్యులతో ఆయన గడిపే క్షణాలు, సందర్భాలు స్పెషల్ అనే చెప్పాలి. సంక్రాంతి (Pongal)పండుగను పురస్కరించుకొని మెగాఫ్యామిలీ (Mega family)అంతా ఒక్క దక్కర చేరారు. మూడ్రోజుల పండుగలో భాగంగా భోగి రోజు భోగి మంటలు వేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు తానే స్వయంగా అట్లు వేశారు చిరంజీవి(Chiranjeevi).ఆయనతో పాటు తమ్ముడు నాగబాబు (Nagababu)కుమారుడు వరుణ్‌తేజ్‌ (Varun tej)కూడా స్టౌవ్‌పై దోసెలు వేస్తూ కుటుంబ సభ్యులకు రుచికరమైన టిఫెన్‌ తినిపించారు. ఇందులో గమ్మత్తైన విషయం ఏమిటంటే చిరంజీవి వేస్తున్న దోసె సరిగా రాలేదని ..వరుణ్‌ తేజ్ వేస్తున్న దోసెను తన దగ్గరున్న అట్లకాడతో చిందరవందర చేశారు. ఇదేంటని వరుణ్‌తేజ్‌ అంటే నేను వేస్తున్న దోశ కంటె బాగు వస్తుంది అందుకే చెడగొట్టానంటూ తమ్ముడి కొడుకు వరుణ్‌తేజ్‌ని ఆటపట్టించారు మెగాస్టార్. ఇది దోశె కాదు..ఉప్మా అంటూ తెగ అల్లరి చేశారు చిరంజీవి. అనంతరం తన కుమారుడు రామ్‌చరణ్‌(Ram charan) , వరుణ్‌తేజ్‌తో పాటు నిహారిక (Niharika)కుటుంబ సభ్యులందరికి అట్లు తినిపించారు.

కొణిదెల వారింట్లో సంతోషాలకు కొదవేలేదు..
మెగాస్టార్ ఇంట్లో గెట్ టు గెదర్ అంటే అంతా హ్యాపీగా కనిపిస్తారు. ఏ ఒక్కరు మిస్సవకుండా అంతా అటెండ్ అయ్యారు సంక్రాంతి పండుగ వేడుకలకు. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన, నాగబాబు, వరుణ్‌తేజ్ నిహారిక, సాయిధరమ్‌తేజ్‌తో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ అంతా చిరంజీవి ఇంట్లో సందడి చేశారు. ప్రతి ఒక్కరికి చిరంజీవి పేరు పేరునా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ పొంగల్ అంటూ విష్ చేశారు.



సూపర్‌ ఫ్యామిలీ..
మెగా ఫ్యామిలీ పొంగల్ సెలబ్రేషన్స్‌ని తమ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. మెగా ఫ్యామిలీ పేరుకే కాదు సంప్రదాయ పండుగల్ని కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకుంటూ ఆదర్శ కుటుంబం అని చాటుకుంటున్నారు.



మెగాస్టార్‌ ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి భోగి పండుగ జరుపుకున్నారు. సంక్రాంతి, కనుమ పండుగ రెండ్రోజులు కూడా ఇలాగే మెగా హీరోలంతా కలిసి ఒకే చోట సందడి చేయనున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Mega Family, Sankranti

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు