చిరంజీవి అమ్మకు ప్రేమతో.. ఘనంగా అంజనా దేవి జన్మదిన వేడుకలు..

Megastar Chiranjeevi: జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో తెలుసు కదా.. ఇప్పుడు చిరంజీవి ఇంట్లో అమ్మకు ప్రేమతో కనిపించింది. తెలుగు ఇండస్ట్రీకి మెగాస్టార్‌ను అందించిన మాతృమూర్తి అంజనా దేవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 29, 2020, 9:18 PM IST
చిరంజీవి అమ్మకు ప్రేమతో.. ఘనంగా అంజనా దేవి జన్మదిన వేడుకలు..
తల్లి అంజనా దేవితో చిరంజీవి (Chiranjeevi mother Anjana Devi)
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో తెలుసు కదా.. ఇప్పుడు చిరంజీవి ఇంట్లో అమ్మకు ప్రేమతో కనిపించింది. తెలుగు ఇండస్ట్రీకి మెగాస్టార్‌ను అందించిన మాతృమూర్తి అంజనా దేవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 29న ఈమె పుట్టిన రోజు. తల్లి బర్త్ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరిపాడు చిరంజీవి. అమ్మ అంటే చిరుకు చాలా ఇష్టం.. ఇప్పటికి ఎంత బిజీగా ఉన్నా కూడా కచ్చితంగా అమ్మతో చాలా టైమ్ స్పెండ్ చేస్తుంటాడు ఈయన. తన సినిమాలను కూడా తల్లితో కలిసి చూస్తుంటాడు. ఎంత పెద్దైనా కూడా ఇప్పటికీ తల్లి ముందు మాత్రం చిన్న పిల్లాడిగా మారిపోతాడు మెగాస్టార్.
తల్లి అంజనా దేవితో చిరంజీవి (Chiranjeevi mother Anjana Devi)
తల్లి అంజనా దేవితో చిరంజీవి (Chiranjeevi mother Anjana Devi)

అంజనా దేవితో చిరు ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు చిరంజీవి. ఈ ఫోటోలతో పాటు పలు సందర్భాలలో అమ్మంటే తనకు ఎంత సెంటిమెంట్ అనేది కూడా చెప్పుకొచ్చాడు చిరు. ఇప్పుడు ఆమె జన్మదిన వేడుకలను కూడా అంతే ఘనంగా నిర్వహించాడు. కొరటాల శివ షూటింగ్‌తో బిజీగా ఉన్నా కూడా వచ్చి అమ్మ పుట్టిన రోజు చేసాడు మెగాస్టార్.

తల్లి అంజనా దేవితో చిరంజీవి (Chiranjeevi mother Anjana Devi)
తల్లి అంజనా దేవితో చిరంజీవి (Chiranjeevi mother Anjana Devi)

రోజంతా ఆమెతోనే సరదాగా గడిపాడు చిరు. తల్లితో సెల్ఫీ దిగుతూ ఉత్సాహంగా కనిపించాడు మెగాస్టార్. తల్లితో కేక్‌ కట్‌ చేయించాడు. ఈ వేడుకల్లో చిరు సతీమణి సురేఖతో పాటు నిహారిక, సుష్మిత సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఫోటోలను మెగా డాటర్ నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అలాగే నాయన్నమ్మకు బర్త్‌ డే విషెస్‌ కూడా తెలిపింది ఈమె. మనవళ్లు, మనవరాళ్లు, కొడుకుతో కలిసి అంజనా దేవి కూడా చాలా ఉత్సాహంగా కనిపించారు.First published: January 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు