మంచు ఫ్యామిలితో చిరంజీవి... విష్ణు కూతుర్ని ఎత్తుకున్న మెగాస్టార్

మంచు ఫ్యామిలితో సరదాగా గడిపి చిరుకి... విష్ణు, విరానికా దంపతులు తమ చిన్న కుమార్తె ఐరా విద్యను పరిచయం చేశారు.

news18-telugu
Updated: October 28, 2019, 10:15 AM IST
మంచు ఫ్యామిలితో చిరంజీవి... విష్ణు కూతుర్ని ఎత్తుకున్న మెగాస్టార్
మంచువారింట్లో సందడి చేసిన చిరంజీవి
  • Share this:
దీపావళి సందర్భంగా మంచు వారింట్లో సందడి చేశారు మెగాస్టార్ చిరంజీవి. దీపావళి సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు నటుడు మంచు విష్ణు శంషాబాద్‌లోని తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి, ప్రభాస్ సహా పలువురు ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. మంచు ఫ్యామిలితో సరదాగా గడిపి చిరుకి... విష్ణు, విరానికా దంపతులు తమ చిన్న కుమార్తె ఐరా విద్యను పరిచయం చేశారు. చిరు చేతికి తమ కుమార్తెను ఇచ్చి ఆశీర్వదించమని కోరారు. చిరంజీవి తమ కుమార్తెను ఎత్తుకున్న ఫొటోలను విష్ణు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.‘కూలెస్ట్ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి అంకుల్‌కి ఐరా విద్యను పరిచయం చేశాను’ అని క్యాప్షన్ తగిలించాడు.

విష్ణు వెరోనికాతో చిరంజీవి


మరోవైపు డార్లింగ్ ప్రభాస్ కూడా మంచువారింట్లో సందడి చేశాడు. హైదరాబాద్ లోనే ఉన్న డార్లింగ్ ఆదివారం మంచు విష్ణు తన నివాసంలో ఏర్పాటు చేసిన దీపావళి సెలెబ్రేషన్స్ కు హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.First published: October 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు