చిరంజీవి మెచ్చిన ‘సాహో’...ప్రభాస్ ఖుషీ

సాహో ట్రైలర్ చూసిన సినీ ప్రముఖులు కూడా బాగా స్పందించారని ప్రభాస్ తెలిపాడు. సాహో ట్రైలర్ చూసి చిరంజీవి తనకు మేసేజ్ చేశారని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

news18-telugu
Updated: August 11, 2019, 6:44 PM IST
చిరంజీవి మెచ్చిన ‘సాహో’...ప్రభాస్ ఖుషీ
చిరంజీవి,ప్రభాస్
  • Share this:
ఈ నెల 30న విడుదల కాబోయే సాహో సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టిన చిత్ర యూనిట్ ముందుగా తెలుగు మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాహో విశేషాలను ప్రభాస్ మీడియాకు వివరించాడు. సాహో ట్రైలర్ చూసిన సినీ ప్రముఖులు కూడా బాగా స్పందించారని ప్రభాస్ తెలిపాడు. సాహో ట్రైలర్ చూసి చిరంజీవి తనకు మెసేజ్ చేశారని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అది చూసి తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని అన్నాడు. వెంటనే ఆయనకు ఫోన్ చేశానని యంగ్ రెబల్ స్టార్ కామెంట్ చేశాడు. ఇది తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. దర్శకుడు రాజమౌళికి కూడా సాహో ట్రైలర్ నచ్చిందని...ఆయన కూడా తనకు మెసేజ్ చేశారని ప్రభాస్ వివరించాడు.

ఇక సాహో కోసం తాము ఎంతగానో కష్టపడ్డామని ప్రభాస్ చెప్పాడు. కొన్ని యాక్షన్స్ సీన్స్ కోసం నెలలపాటు శ్రమించామని అన్నారు. బాహుబలి కంటే ముందే దర్శకుడు సుజిత్ తనకు సాహో స్టోరీ చెప్పారన్న ప్రభాస్... బాహుబలి విజయం సాహోపై మరింత ఫోకస్ పెట్టేలా చేసిందని అన్నాడు. ఈ కారణంగానే సినిమా బడ్జెట్ కూడా పెరిగిందని ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. సాహో సినిమాకు హిందీలోనూ తానే డబ్బింగ్ చెప్పానన్న ప్రభాస్... సినిమాలో యాక్షన్ సీన్స్ అందరినీ మెప్పించే విధంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు.


First published: August 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>