Chiranjeevi : రామ్ చరణ్ దర్శకుడి నుంచి గాడ్ ఫాదర్‌ను అరువు తెచ్చుకుంటున్న చిరంజీవి.. మెగాస్టార్ ఏంటి.. రామ్ చరణ్ దర్శకుడి దగ్గర ‘గాడ్ ఫాదర్’ అరువు తెచ్చుకోవడం ఏమిటి అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి ప్రెజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానీకొచ్చింది. మరో వారంలోగా ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. చిరంజీవి బర్త్ డే రోజున ఈ సినిమాకు విడుదల తేదికి సంబంధించి ప్రకటన చేయవచ్చు అంటున్నారు. ఈ చిత్రంలో చిరుకు జోడి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత చిరు.. లూసీఫర్ రీమేక్ షూటింగ్లో పాల్గొననున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛంగా ప్రారంభమైంది.
ఇక ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల పరిశీలనలో ఉంది. ఐతే.. దర్శకుడు సంపత్ నంది.. ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో ఓ కథను రాసుకొని ఫిల్మ్ ఛాంబర్లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ కూడా చేశారు. దీంతో చిరంజీవి.. సంపత్ నంది తన ఇంటికి పిలిపించి తను చేయబోయే ‘లూసీఫర్’ రీమేక్ కోసం ఈ టైటిల్ ఇవ్వమంటూ రిక్వెస్ట్ చేసారట. అంతేకాదు మంచి కథ ఉంటే.. ఆయన దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. అందుకే సంపత్ నంది తన సినిమా కోసం ఏరికోరి పెట్టుకున్న టైటిల్‌ను చిరంజీవి కోసం త్యాగం చేసినట్టు సమాచారం.
చిరంజీవి,సంపత్ నంది (Instagram/Photo)
‘లూసీఫీర్’ రీమేక్‌కు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌ను ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ప్రకటించడమే కాకుండా.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం. అదే రోజు ఈ సినిమాలో నటించే మిగతా నటీనటుల వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో చిరంజీవి చాలా యేళ్ల తర్వాత తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ సినిమాను రీమేక్ చేస్తున్నారు. దాంతో పాటు పలువురు దర్శకులు చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. అందులో సంపత్ నంది సినిమా ప్రకటించినా.. ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.