టీడీపీ ఎమ్మెల్యేకు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు..

చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగానే ఉన్నాడు. కానీ ఆయన్ని మాత్రం రాజకీయాలు వదిలిపెట్టడం లేదు. అప్పట్లో ఆయన చేసిన రాజకీయాల కారణంగా ఇప్పటికీ వాళ్లతో సాన్నిహిత్యం ఉంది ఆయనకు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 2, 2019, 10:18 PM IST
టీడీపీ ఎమ్మెల్యేకు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు..
చిరంజీవి గంటా శ్రీనివాస రావు
  • Share this:
చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగానే ఉన్నాడు. కానీ ఆయన్ని మాత్రం రాజకీయాలు వదిలిపెట్టడం లేదు. అప్పట్లో ఆయన చేసిన రాజకీయాల కారణంగా ఇప్పటికీ వాళ్లతో సాన్నిహిత్యం ఉంది ఆయనకు. ప్రజారాజ్యం టైమ్‌లో చిరుతో చాలా మంది రాజకీయ నాయకులు కలిసిపోయారు.. స్నేహితులు అయ్యారు.. ఇప్పటికీ వాళ్లతో అదే స్నేహం కంటిన్యూ చేస్తుంటాడు మెగాస్టార్. ముఖ్యంగా కొందరు నాయకులు అయితే ఇప్పటికీ చిరు అంటే చాలా ఇష్టపడుతుంటారు. అందులో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా ఒకరు. ఆయన్ని రాజకీయ నాయకుడిగా అస్సలు చూడరు చిరంజీవి.కుటుంబ సభ్యుడిగానే చూస్తుంటాడు. అప్పట్లో ప్రజారాజ్యంలో కూడా ఉన్నాడు గంటా. దానికి ముందు నుంచి కూడా గంటాతో మంచి అనుబంధం ఉంది చిరంజీవికి. డిసెంబర్ 1న గంటా శ్రీనివాస రావు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు చిరంజీవి. అన్నయ్య ఇంటికి వెళ్లి మరి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు గంటా. తన ట్విట్టర్లో కూడా చిరంజీవిని కలిసిన ఫోటోలు పోస్ట్ చేసాడు గంటా. పుట్టిన రోజు నాడు అన్నయ్యను కలవడం.. ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేసాడు.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...