ప్రస్తుతం అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో కూడా బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. ప్రతీ దర్శకుడు ఇప్పుడు తమ చూపులు బయోపిక్స్ వైపు వేస్తున్నారు. కథ కొత్తగా రాయాల్సిన అవసరం ఉండదు. జరిగిన సంఘటనలను కాస్త సినిమాటిక్ టచ్ ఇచ్చి తెరకెక్కిస్తే చాలు బయోపిక్ రెడీ. అందుకే ఇప్పుడు అందరి జీవితాలను తెరకెక్కించే బాధ్యత తీసుకుంటున్నారు దర్శకులు. ఇప్పటికే తెలుగులో సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి లెజెండ్స్ బయోపిక్స్ వచ్చాయి. ఇందులో సావిత్రి బయోపిక్ మహానటి సంచలన విజయం సాధించింది కూడా.ఇదే క్రమంలో ఇప్పుడు చిరంజీవి బయోపిక్ కూడా వస్తుందేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఎలాగూ ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తీస్తే బాగుంటుందేమో అనే చర్చ మొదలైందిప్పుడు. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ చిరంజీవి బయోపిక్ ప్లాన్ చేస్తున్నట్టు వాల్మికీ ప్రమోషన్లో భాగంగా హీరో వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ‘వాల్మీకి’ చిత్ర షూటింగ్ సమయంలోనే దర్శకుడు హరీష్ శంకర్ చిరంజీవి బయోపిక్‌ను తెరకెక్కించే ఆలోచన ఉన్నట్టు తనతో చెప్పాడన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసుకున్నట్టు తెలిపాడు.
ఇక ఈ బయోపిక్ తెరకెక్కిస్తే.. చిరంజీవి పాత్ర చేయడానికి రామ్ చరణ్ మాత్రమే అర్హత ఉందన్నారు. ఒకవేళ రామ్ చరణ్ చేయకపోతే.. పెదనాన్న పాత్ర చేయడానికి నేను రెడీ అంటూ వాల్మీకి ప్రమోషన్లో భాగంగా వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే చిరంజీవి బయోపిక్ పై నాగబాబు పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అన్నయ్య చిరంజీవి బయోపిక్ తీసే ఆలోచన కానీ.. ఉద్దేశ్యం కానీ అస్సలు లేవని నాగబాబు ఇప్పటికే చెప్పారు. పైగా చిరంజీవి జీవితంలో అలాంటి ఎమోషనల్ సీన్స్ లేవని.. డ్రామా పండించే సీన్స్ లేకపోతే బయోపిక్ పండదని అప్పట్లో నాగబాబు చిరంజీవి బయోపిక్ పై స్పందించిన సంగతి తెలిసిందే కదా. మొత్తానికి మెగాస్టార్ తన బయోపిక్ తెరకెక్కించడానికి అనుమతి ఇస్తాడా ఇవ్వడా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Harish Shankar, Nagababu, Ram Charan, Surender reddy, Sye Raa Narasimha Reddy Movie Review, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood, Valmiki, Valmiki Movie Review