Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI BIOGRAPHY OF CHIRANJEEVI AS A SUBJECT BANDLA GANESHS REQUEST TO THE TWO TELUGU STATE GOVERNMENTS TA

Chiranjeevi : పాఠ్యాంశంగా చిరంజీవి జీవిత చరిత్ర.. ప్రభుత్వానికి బండ్ల గణేష్ విన్నపం..

చిరంజీవి,బండ్ల గణేష్ (File/Photo)

చిరంజీవి,బండ్ల గణేష్ (File/Photo)

Chiranjeevi : పాఠ్యాంశంగా చిరంజీవి జీవిత చరిత్ర.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేసారు.

  Chiranjeevi : పాఠ్యాంశంగా చిరంజీవి జీవిత చరిత్ర.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేసారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సుప్రీం హీరోగా.. ఆపై మెగాస్టార్‌గా ఆశేష తెలుగు ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. చిరు జీవితం వడ్డించిన విస్తరికాదు. మొదట్లో ఎన్నో ఒడిదుడికులు, మరెన్నో విమర్శలు. విమర్శలకు కృంగిపోకుండా...పొగడ్తలకు పొంగిపోకుండా ....ఒక్కో నిచ్చెన ఎక్కుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగారు. అప్పటి వరకు మెలోడ్రామాతో సాగిన ఇండస్ట్రీకి అల్టిమేట్ డాన్స్ ను, ఫైట్స్ ను పరిచయం చేసి యువతను తనమైకంలో పడేసారు చిరంజీవి.  అంతేకాదు అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి హీరోలు అభిమానల సంఘాలతో కొన్ని సేవాల కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. దివి సీమ ఉప్పెన సహా రాష్ట్రంలో ఏ రకమైన విపత్తులు సంబవించినా ఆయా హీరోలు తమ వంతు సాయం చేస్తుండేవారు. అదే బాటలో తర్వాత తరం హీరోల్లో చిరంజీవి కూడా బ్లడ్ బ్యాంక్‌తో పాటు ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శప్రాయుడయ్యారు.

  ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శమయ్యాయి. అందుకే ఆయన జీవితాన్ని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశంగా పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా  ఓ అభిమాని పెట్టిన ట్వీట్‌ను బండ్ల గణేష్  రీ ట్వీట్ చేసారు. అది కాస్తా ఇపుడు వైరల్ అవుతోంది.  రాజకీయాల్లో ప్రవేశించి (పీఆర్పీ)  ప్రజా రాజ్యం పార్టీని స్టాపించి 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో 18 ఎమ్మెల్యే సీట్లు గెలుపొందారు. ఎంత చేసినా అధికారంలోకి రాలేకపోయింది. సరైన రాజకీయ పరిజ్ఞానం లేకపోవడం పాటు అప్పటికే వేరే పార్టీల నుంచి తన పార్టీ టికెట్ గెలిచిన వారు ఆయన మాట వినకపోవడంతో చేసేది లేక తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. అందుకు ప్రతిగా చిరంజీవి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రి(స్వతంత్ర) గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇరు  రాష్ట్రాలతో పాటు కేంద్రంలోకి అధికారంలోకి రాకపోవడంతో చిరు.. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస  సినిమాలు చేస్తున్నారు.

  Megastar Chiranjeevi Biography of Chiranjeevi as a subject Bandla Ganeshs request to the Two Telugu State Governments,Chiranjeevi : పాఠ్యాంశంగా చిరంజీవి జీవిత చరిత్ర.. ప్రభుత్వానికి బండ్ల గణేష్ విన్నపం..
  చిరంజీవి,బండ్ల గణేష్ (File/Photo)


  ఇక బండ్ల గణేష్ చేసిన ఈ విజ్ఞప్తిని మెగాభిమానులు స్వాగతిస్తున్నారు.మరోవైపు చంద్రునికో మచ్చలా ఆయన రాజకీయ జీవితం ఆయనకు అడుగడున అడ్డుతలుగుతోంది. కొందరు మాత్రం చిరంజీవి సినిమాల్లోనే హీరో. రాజకీయాల్లో జీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రాండ్ లేకుండా వచ్చి మెగాస్టార్‌గా ఎదిగిన వైనం ఎందరో హీరోలకు ఆదర్శం. రాజకీయాలను పక్కనపెడితే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి అసలు మెగాస్టార్ అనే చెప్పాలి.

  ఇవి కూడా చదవండి.. 

  Ram Gopal Varma : తనదైన శైలిలో మరోసారి మెగా ఫ్యామిలీ రామ్ గోపాల్ వర్మ పంచ్‌లు..


  Evaru Meelo Koteeswarulu - Jr NTR : ఎన్టీఆర్ షోలో రానా సాయం తీసుకున్న రామ్ చరణ్..


  Salman Khan : సల్మాన్ అయితే నాకేంటి.. ? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సల్లూ భాయ్‌కు చుక్కలు చూపించిన యువ అధికారి..


  Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

  Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya, Bandla Ganesh, Bhola Shankar Movie, Chiranjeevi, God Father Movie, Tollywood

  తదుపరి వార్తలు