MEGASTAR CHIRANJEEVI BIG SHOCK TO HIS FANS DUE TO ACHARYA MOVIE RELEASE DATE POSTPONED TA
Chirnajeevi: మెగాఫ్యాన్స్కు చిరంజీవి బిగ్‌షాక్..
చిరంజీవి (Twitter/Photo)
Chiranjeevi kotatala siva Movie | మెగాస్టార్ చిరంజీవి ఆయన అభిమానులకు బిగ్ షాక్ ఇవ్వనున్నాడు. ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల విషయమై..
మెగాస్టార్ చిరంజీవి ఆయన అభిమానులకు బిగ్ షాక్ ఇవ్వనున్నాడు. ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి నటిస్తోన్న ఈచిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. .ఈ చిత్రాన్ని కొరటాల శివ సామాజిక సమస్యను బేస్ చేసుకొని తెరకెక్కిస్తున్నాడు. నక్సలైట్, దేవాదాయ శాఖ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం అసాధ్యమే అంటున్నాయి సినీ వర్గాలు. ఈ సినిమాలో ముందుగా మహేష్ బాబు కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్‌లో యాక్ట్ చేయడానికి మహేష్ బాబు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. దీంవతో ఈ సినిమాలో మరో హీరోగా ఎవరు నటిస్తారనే విషయమై క్లారిటీ లేదు. మరోవైపు ఈ సినిమాలో నటించాల్సిన త్రిష తన పర్సనల్ కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకుంది.
చిరంజీవి కొరటాల సినిమా లుక్ లీక్ (chiranjeevi new movie title acharya)
ప్రస్తుతం చిత్ర యూనిట్ మరో కథానాయిక కోసం వెతుకుతున్నారు. ఈ సినిమాలో అనుష్క లేదా కాజల్ పేర్లను పరిశీలిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను ఆగష్టులో విడుదల చేయాలని ముందు నుంచి అనుకున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దసరాకు విడుదల చేయడం కూడా అనుమానమే అని చెబుతున్నారు. సంక్రాంతికి వద్దామనుకుంటే తన కొడుకు రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’కు పోటీగా తన సినిమాను విడుదల చేసే అవకాశమే లేదు. దీంతో ఈ సినిమాను వచ్చే సమ్మర్లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి ఈ యేడాది థియేటర్స్‌లో చిరంజీవి సినిమా చూడాలనుకునే అభిమానులకు ఇది చేదువార్తే అని చెప్పాలి.