Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. చిరంజీవి (Chiranjeevi ) విషయానికొస్తే.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. (Acharya) ఆచార్య ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. హీరోగా చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 4న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఈ విడుదల తేదిని ఫిక్స్ చేసినట్టు సమాచారం.
ఆచార్యతో పాటు గాడ్ ఫాదర్ మూవీతో పాటు ‘భోళా శంకర్’ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ తమిళ వేదాళం మూవీకి రీమేక్. ఈ సినిమాలో చిరంజీవితో పాటు ఆయన చెల్లెలుగా కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా చేస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకి ఇది రెండో సినిమా అని చెప్పాలి. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి సంగీతం అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
Wishing the Talented & Amazingly Skilled Young Music Composer #MahatiSwaraSagar ? a very Happy Birthday!
&
Proudly Welcoming on board for our MEGA FILM!
- Team #BholaaShankar ?
Mega ? @KChiruTweets@KeerthyOfficial @MeherRamesh @AnilSunkara1 @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/3r0hCpA1LO
— BA Raju's Team (@baraju_SuperHit) October 15, 2021
తాజాగా విజయ దశమి సందర్భంగా ఆ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ .. మహతి స్వర సాగర్, మెహర్ రమేష్‌లతో దిగిన ఫోటోను షేర్ చేసారు. ఏమైనా మణిశర్మతో కాకుండా.. ఆయన తనయుడు మహతికి కూడా ఇపుడు చిరంజీవి ఛాన్స్ ఇవ్వడంతో ఇపుడు బడా హీరోల దృష్టి స్వర సాగర్ మహతి పై పడింది.
ఇక చిరంజీవి చేస్తోన్న ‘ఆచార్య’ విషయానికొస్తే.. ఇందులో చిరుతో పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట.ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్ చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో నటించబోతన్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya, Bhola Shankar, Chiranjeevi, Meher ramesh, Swara Sagar Mahati, Tollywood