చిరంజీవితో రామ్ చరణ్‌ను బెల్ట్‌తో కొట్టించిన నాగబాబు..

Ram Charan Chiranjeevi: చిరంజీవి ఏంటి రామ్ చరణ్‌ను కొట్టడం ఏంటి..? అది కూడా బెల్టుతో.. పైగా దానికి కారణం నాగబాబు..?  అబ్బే ఇదేదో తప్పుడు వార్త అయ్యుంటుందిలే అనుకుంటున్నారు కదా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 5, 2020, 10:46 PM IST
చిరంజీవితో రామ్ చరణ్‌ను బెల్ట్‌తో కొట్టించిన నాగబాబు..
చిరంజీవి రామ్ చరణ్ (Twitter/Ram Charan Chiranjeevi)
  • Share this:
చిరంజీవి ఏంటి రామ్ చరణ్‌ను కొట్టడం ఏంటి..? అది కూడా బెల్టుతో.. పైగా దానికి కారణం నాగబాబు..?  అబ్బే ఇదేదో తప్పుడు వార్త అయ్యుంటుందిలే అనుకుంటున్నారు కదా..? కానీ ఇదే నిజం.. స్వయంగా రామ్ చరణ్ చెప్పిన నిజం. ఎప్పుడో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు తన జీవితంలో ఒక్కసారి మాత్రమే తన తండ్రి తనపై చేయి చేసుకున్నాడని.. అది కూడా నాగబాబు బాబాయ్ వల్లే అని చెప్పాడు రామ్ చరణ్. ఇది జరిగి కూడా దాదాపు 25 ఏళ్లు గడిచిపోయింది.

చిరంజీవి రామ్ చరణ్ (chiranjeevi ram charan)
చిరంజీవి రామ్ చరణ్ (chiranjeevi ram charan)


అప్పట్లో 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తన తాత గిఫ్ట్‌గా ఇచ్చిన పోలీస్ బెల్ట్‌తో తండ్రి తనను కొట్టాడని చెప్పాడు చరణ్. దానికి కారణం కూడా చెప్పాడు ఈయన. తన ఇంటి గేటు దగ్గర డ్రైవర్ సెక్యూరిటీ మాట్లాడుకోవడం విని.. వాళ్లేం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక వచ్చి వాళ్లు మాట్లాడిన మాటలకు అర్థమేంటి అని నాగబాబు బాబాయ్‌ను అడిగానని... అయితే అదే సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుని నాన్న ఇంటికి వచ్చాడని చెప్పాడు చరణ్. అక్కడే ఉన్న నాగ బాబాయ్ ఇంటి లోపలికి నాన్నను తీసుకెళ్లి వీడు బూతులు నేర్చుకుని దానికి అర్థం నన్నే అడుగుతున్నాడంటూ కంప్లైంట్ ఇచ్చాడని చెప్పాడు.

చిరంజీవి రామ్ చరణ్ (chiranjeevi ram charan)
చిరంజీవి రామ్ చరణ్ (chiranjeevi ram charan)


అంతే ఒక్కసారిగా నాన్నకు కోపం వచ్చి.. తనను పోలీస్ బెల్ట్‌తో కొట్టారని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కోపం తగ్గిన తర్వాత తనను దగ్గరికి తీసుకుని ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదని.. అవి మంచి మాటలు కాదు అంటూ చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు మెగా పవర్ స్టార్. అది జరిగిన తర్వాత తాను నాగబాబు బాబాయ్‌తో చాలా రోజుల వరకు మాట్లాడలేదని కూడా చెప్పాడు చరణ్.

అత్తా మామ చిరంజీవి,సురేఖలతో రామ్ చరణ్ ఉపాసన (Twitter/Photo)
అత్తా మామ చిరంజీవి,సురేఖలతో రామ్ చరణ్ ఉపాసన (Twitter/Photo)


ఇప్పటికీ తాను నాన్నతో ఉన్నపుడు కలిసి మాట్లాడడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటానని చెప్పాడు చరణ్. కానీ ఉపాసన మాత్రం ఎలాంటి భయం లేకుండా నేరుగా వెళ్లి మాట్లాడుతుందంటూ చెప్పుకొచ్చాడు ఈయన. తమ ఇంట్లో ఉపాసనకు నాన్న చిరంజీవి మంచి స్నేహితుడు అంటూ తెలిపాడు రామ్ చరణ్. ఇక తన విషయానికి వస్తే ఆ ఒక్కసారి తప్ప జీవితంలో మళ్ళీ తనపై నాన్న ఎప్పుడూ చేయెత్తలేదని చెప్పాడు.
First published: May 5, 2020, 10:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading