Chiranjeevi - Dil Raju - Sriram Venu: దిల్ రాజు, శ్రీరామ్ వేణులను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి..

వకీల్ సాబ్ దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజులను సత్కరించిన చిరు (Twitter/Photo)

Chiranjeevi - Dil Raju - Sriram Venu: ఈ శుక్రవారం (ఏప్రిల్ 9)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘వకీల్ సాబ్’ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయినందకు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా దర్శకుడు శ్రీరామ్ వేణు‌తో పాటు నిర్మాత దిల్ రాజులను సత్కరించారు. .

  • Share this:
    Chiranjeevi - Dil Raju - Sriram Venu: ఈ శుక్రవారం (ఏప్రిల్ 9)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘వకీల్ సాబ్’ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ పై అన్ని వర్గాల నుంచి పాజిటివ్ బజ్ వినబడుతోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ సినిమా చూసి పవన్ కళ్యాణ్.. పవర్ ప్యాక్‌డ్ పర్ఫామెన్స్‌తో పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ మూవీతో పలకరించరంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే  మెగాస్టార్ చిరంజీవి.. అమ్మ అంజనా దేవి, భార్య సురేఖ, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌లో కలిసి  తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీ చూసారు. ఈ సినిమా చూసిన తర్వాత  చాల ా కాలం తర్వాత పవన్ లోని నటుడిని ఈ సినిమాలో చూసానంటూ ఆనందం వ్యక్తం చేసారు.

    ఈ సందర్భంగా చిరంజీవి ఈ చిత్ర నిర్మాతలైన దిల్ రాజుతో పాటు దర్శకుడు శ్రీరామ్ వేణు‌లను పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్‌తో ఇటువంటి సందేశాత్మక చిత్రం చేసినందకు కృతజ్ఞతలు తెలియజేసారు.

    ‘వకీల్ సాబ్’ చిత్ర దర్శక, నిర్మాతలైన దిల్ రాజు, శ్రీరామ్ వేణులను సత్కరించిన చిరు (Twitter/Photo)


    వకీల్ సాబ్ మూవీ విషయానికొస్తే.. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లకు పైగా రాబట్టింది. కరోనా సమయంలో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టి హీరోగా పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 53 కోట్లకు పైగా వసూళ్లను సాధించాలి.ఓవర్సీస్‌లో ఈ సినిమా ఫస్ట్ డే హాఫ్ మిలియన్ డాలర్స్ కలెక్షన్లు రాబట్టింది.

    ‘వకీల్ సాబ్‌’గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


    ఆస్ట్రేలియాలో రూ. 1.21 కోట్లను వసూళ్లను సాధించింది. మరోవైపు న్యూజిలాండ్‌లో రూ. 10.10 లక్షలను సాధించింది. మొత్తంగా అమెరికా ఇతర దేశాల్లో  ఓవర్సీస్‌లో కలిపి వకీల్ సాబ్ సినిమా దాదాపు రూ. 5 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ముందు ముందు ఈ సినిమా ఏ మేరక కలెక్షన్‌లను రాబడుతుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: