MEGASTAR CHIRANJEEVI APPRECIATE HIS BROTHER NAGA BABU FOR DONATING PLASMA AFTER CORONA RECOVERY PK
Chiranjeevi Naga Babu: నాగబాబు చేసిన పనికి మెచ్చుకున్న చిరంజీవి.. ఏం చేసాడో తెలుసా..?
చిరంజీవి నాగబాబు (chiranjeevi naga babu)
Naga Babu Chiranjeevi: నాగబాబు ఈ మధ్య బయటికి రావడం బొత్తిగా తగ్గించేసాడు. ఆ మధ్య ఈయనకు కరోనా వైరస్ వచ్చింది. పాజిటివ్ అని తెలియగానే తను చేస్తున్న షోలకు ఫుల్ స్టాప్ పెట్టేసాడు. క్వారంటైన్ టైమ్ అంతా ఇంట్లోనే ఒంటరిగా..
నాగబాబు ఈ మధ్య బయటికి రావడం బొత్తిగా తగ్గించేసాడు. ఆ మధ్య ఈయనకు కరోనా వైరస్ వచ్చింది. పాజిటివ్ అని తెలియగానే తను చేస్తున్న షోలకు ఫుల్ స్టాప్ పెట్టేసాడు. క్వారంటైన్ టైమ్ అంతా ఇంట్లోనే ఒంటరిగా గడిపేసాడు. పూర్తిగా కోలుకునే వరకు అడుగు కూడా బయటపెట్టలేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను దిగ్విజయంగా గెలిచేసాడు నాగబాబు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తన షోలు చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ప్లాస్మా ఇచ్చాడు నాగబాబు. కరోనాకు వ్యాక్సిన్ ఇంకా రాలేదు కానీ దాన్నుంచి బయట పడటానికి వజ్రాయుధం మాత్రం ప్లాస్మానే. కరోనా నుంచి బయట పడిన శరీరం నుంచి ప్లాస్మా తీసుకుని దాన్ని విషమంగా ఉన్న వాళ్ల శరీరంలోకి ఎక్కిస్తారు. అలా ఇద్దరి ప్రాణాలు కాపాడొచ్చు కూడా. చాలా మందికి దీనిపై అవగాహన లేకపోవడంతో ప్లాస్మా అనేది ఊరికే వృథా అయిపోతుంది. అందుకే చిరంజీవి, నాగార్జున, రాజమౌళి లాంటి వాళ్లు కూడా బయటికి వచ్చి ఈ ప్లాస్మా డొనేషన్ గురించి చెప్పారు.
ఇప్పుడు నాగబాబు కూడా ఇదే చేసి చూపించాడు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లంతా స్వచ్ఛందంగా వచ్చి ప్లాస్మాను దానం చేయాలని చిరంజీవి కోరాడు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో ప్రత్యేకంగా ప్లాస్మాను సేకరించే విభాగాన్ని కూడా ఏర్పాటు చేసామని తెలిపాడు. యాంటీ బాడీస్ ఉత్పత్తి అయిన వాళ్లంతా వచ్చి ప్లాస్మా దానం చేయాలని వేడుకున్నాడు. ఈ క్రమంలోనే అన్న చెప్పిన మాటను విని చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా ప్లాస్మాను దానం చేశాడు.
ఈ మధ్యే నాగబాబు కరోనా నుంచి కోలుకున్నాడు. యాంటీ బాడీస్ కూడా బాగానే ఉండటంతో ఈయన ప్లాస్మా దానం చేసాడు. దాంతో తమ్ముడు నాగబాబును మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించాడు. 'కరోనా మహమ్మారితో పోరాడి గెలవటమే కాదు.. ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో CCT(చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్)లో ప్లాస్మా దానం చేసిన తమ్ముడు నాగబాబుకి అభినందనలు.. ఈ సందర్భంగా కోవిడ్ నుంచి కోలుకున్నవాళ్లకు మరో మారు నా విన్నపం.. మీరు ప్లాస్మా దానం చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు.. దయచేసి ముందుకు రండి' అని చిరు పిలుపిచ్చాడు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.