Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI APPEL TO TELANGANA AND AP GOVERMENTS TO HELP TELUGU FILM INDUSTRY TA

Chiranjeevi : దయచేసి సినీ పరిశ్రమను ఆదుకోండి.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు చిరంజీవి విజ్ఞప్తి..

చిరంజీవి (Twitter/Photo)

చిరంజీవి (Twitter/Photo)

Chiranjeevi : దయచేసి సినీ పరిశ్రమను ఆదుకోండి.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు చిరంజీవి ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకగా విజ్జప్తి చేశారు.

    Chiranjeevi : దయచేసి సినీ పరిశ్రమను ఆదుకోండి.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు చిరంజీవి (Chiranjeevi) ‘లవ్ స్టోరీ’ (Love Story) మూవీ ప్రీ రిలీజ్ వేడుకగా విజ్జప్తి చేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు చిరంజీవితో పాటు బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ ముఖ్య అతిథులగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ‘లవ్ స్టోరీ’ సినిమా గురించి మాట్లాడమే కాకుండా.. కరోనా కారణంగా ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ సందర్భంగా  ప్రస్తావించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎక్కడ ఎలాంటి విపత్తు సంభవించిన  ముందుగా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చి ఆదుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

    తెలుగు ప్రజలు ఎపుడు కష్టాల్లో ఉన్న ఆదుకోవడానికి ముందుకు వచ్చే తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం కరోనాతో పాటు ఇతరత్ర కారణాల వల్ల టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. వీటిని సర్ధుకునే వీలు లేకుండా ఉందన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమను ఆదుకోవడానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని చిరు ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ వేడుకగా విజ్జప్తి చేశారు.

    Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

    సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కష్టా నష్టాలను గుర్తించి సహాయం చేయాలని కోరారు. తమ మీద ఎంతో నమ్మకంతో ఎంతో మంది సినిమాలు నిర్మిస్తున్నారు. దానిపై ఆధారపడి ఎంతో మంది ఆధారపడి ఉన్నారు. వారికి వినోదాన్ని పంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. కరోనా కారణంగా కొన్ని నాలుగైదు నెలలు ఎటువంటి షూటింగ్స్ జరగలేదు. దీంతో సినీ కార్మికుల కుటుంబాలు పనిలేక అల్లాడిపోయాయి. సినీ ఇండస్ట్రీ అంటే .. హీరో, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు మాత్రమే కాకుండా.. మిగిలిన క్రాఫ్ట్స్‌తో పాటు కార్మికులు కలిస్తేనే సినీ పరిశ్రమ అన్నారు.

    Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    కరోనా కారణంగా సినిమాలు పూర్తైయినా.. వేరే సినిమాలు చేయాలా వద్దా అనే డైలామాలో ఉన్నామన్నారు. ఆచార్య సినిమా షూటింగ్ పూర్తైయింది. ఎపుడు ఎలా రిలీజ్ చేయాలనే విషయమై ఎంతో ఆలోచిస్తున్నామన్నారు. రిలీజ్ చేస్తే కలెక్షన్లు వస్తాయా రావా అనే ప్రశ్నలు నాలాంటి పెద్ద హీరోనే వెంటాడుతుంది. ఇక మిగిలిన హీరోల పరిస్థితి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదన్నారు. ఈ వారం విడుదలవుతున్న ‘లవ్ స్టోరీ’ దానికి దారి చూపుతుందని విశ్వాసం తనకు ఉందన్నారు.

    Love Story Pre Release Event : నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదిరిన చిరు, సాయి పల్లవిల డాన్స్ మూమెంట్స్..


    ఏమైనా ఈ విషయాలను ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకొని చిత్ర పరిశ్రమను ఆదుకునేలా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేస్తే బాగుంటుందన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Andhra Pradesh, Chiranjeevi, Telangana, Tollywood

    తదుపరి వార్తలు