హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi : తిరుమలలో కురుస్తోన్న వర్షాలపై చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు.. ప్రజలను ఆదుకోవాలంటూ..

Chiranjeevi : తిరుమలలో కురుస్తోన్న వర్షాలపై చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు.. ప్రజలను ఆదుకోవాలంటూ..

2. షూటింగ్‌లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉదయం 7 గంటలకే చిరంజీవి సెట్స్‌లో ఉంటాడు. ఆ సమయానికి ఆయన అక్కడ ఉండాలంటే ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి ఆరు గంటల వరకు వ్యాయామం పూర్తి చేస్తాడు. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అంటాడు చిరంజీవి.

2. షూటింగ్‌లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉదయం 7 గంటలకే చిరంజీవి సెట్స్‌లో ఉంటాడు. ఆ సమయానికి ఆయన అక్కడ ఉండాలంటే ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి ఆరు గంటల వరకు వ్యాయామం పూర్తి చేస్తాడు. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అంటాడు చిరంజీవి.

Chiranjeevi : తిరుమలలో కురుస్తోన్న వర్షాలపై చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు.. ప్రజలను ఆదుకోవాలంటూ.. ఏపీ ప్రభుత్వానికి, టీటీడీని, అన్ని రాజకీయ పార్టీలను తన అభిమానులను పిలుపు నిచ్చారు.

  Chiranjeevi : తిరుమలలో కురుస్తోన్న వర్షాలపై చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు.. ప్రజలను ఆదుకోవాలంటూ.. ఏపీ ప్రభుత్వానికి, టీటీడీని, అన్ని రాజకీయ పార్టీలను తన అభిమానులను పిలుపు నిచ్చారు. గతలో ఎన్నడు కనీవినీ ఎరగనీ రీతిలో తిరుమలలో భారీ వర్షాలు కురిసాయి. తిరుమల ఘాటు రోడ్లని జలమయ్యాయి. వర్షాల ధాటికీ కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో తిరుమల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. అంతేకాదు తిరుమల గిరుల్లో కురిసిన భారీ వర్షాలకు తిరుపతిలోని కపిల తీర్ధం సహా అన్ని ఏరియాలు చెరువులును తలపిస్తున్నాయి. ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఎన్నడు లేనట్టు తిరుమల ప్రధాన ఆలయం చుట్లు నీరు చేరింది.  కేవలం తిరుపతి కాదు.. నెల్లూరు, కడప,తిరుపతి చుట్టు పక్కల ప్రాంతాలు, చెన్నూలో కూడా ఆకాశానికి చిల్లు పడిందా అనే లెవల్లో వర్షం పడి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది.

  దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదిక స్పందించి ప్రజలను ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, టీటీడీ ఆదుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తంగా తిరుపతి ప్రయాణాలు పెట్టుకున్న వారు దాన్ని కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని ఈ సందర్భంగా కోరారు.

  మరోవైపు మంచు లక్ష్మి కూడా తిరుపతి వరుదలపై స్పందించారు. భారీ వర్షాల వల్ల తిరుమల తిరుపతి పరిస్థితులు ఘోరంగా మారాయన్నారు. వరదలతో చాలా మంది ఇళ్లలో ఉన్న బియ్యం, నిత్యావసర వస్తువులు అన్ని నీళ్ల పాలైయ్యాయి. దీంతో చాలా మంది తిండి కోసం పడిగాపులు గాస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు ఎన్డీఆర్‌ఎఫ్ రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాదు తిరుమలలో కురిసిన వర్షాలకు చాలా చోట్ల రోడ్డు కొట్టుకోపోయాయి.  వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అంతేకాదు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

  NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: నాగార్జున, చిరంజీవి,ఎన్టీఆర్, బాలకృష్ణ సహా స్మాల్ స్క్రీన్ పై సందడి చేసిన టాప్ స్టార్స్..


  రీసెంట్‌గా చిరంజీవి ఓ అవార్డు ఫంక్షన్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రం రెండుగా  విభజన అయిన తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు.. సినిమా కళాకారులకు అవార్డులు ఇవ్వడమే మరిచిపోయారిని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ అవార్డు వేడుకల విషయం మరచిపోయాయన్నారు. ఇకపై అయినా ఈ రెండు ప్రభుత్వాలు అలోచించి అవార్డు వేడుకలు నిర్వహిస్తే మంచిదన్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya, Chiranjeevi, God father, Tirumala, Tirupati Floods, Ttd

  ఉత్తమ కథలు