చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ అదే రూట్లో వెళ్లాలనుకుంటున్నారా..

చిరంజీవి వెంకటేష్ (Venkatesh Chiranjeevi)

ప్రస్తుతం తెలుగు హీరోలు  ఛేంజ్ అవుతున్నారు. కాలానుగుణంగా తమను తాము అప్‌డేట్ చేసుకుంటున్నారు. ఎపుడు సినిమాలనే కాదు.. ఇపుడు వేరే విషయాలపై ఆసక్తి చూపుతున్నారు.

 • Share this:
  ప్రస్తుతం తెలుగు హీరోలు  ఛేంజ్ అవుతున్నారు. కాలానుగుణంగా తమను తాము అప్‌డేట్ చేసుకుంటున్నారు. ఎపుడు సినిమాలనే కాదు.. ఇపుడు వేరే విషయాలపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం సినిమాలకు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్,హాట్ స్టార్, జీ 5 వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో గట్టి పోటీ ఏర్పడింది. దీంతో హీరోలు కూడా సినిమాలతో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో తమ లక్‌ను పరీక్షించుకోవాలనుకుంటున్నారు.  ఇప్పటికే స్మాల్ స్క్రీన్ పై చిరంజీవి, నాగార్జున స్టార్ మా చానెల్‌లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి రియాలిటీ షోలో పార్టిసిపేట్ సంగతి తెలిసిందే కదా. ఇక నాగార్జున ఒక అడుగు ముందుకేసీ ‘బిగ్‌బాస్’ వంటి రియాల్టీ షోకు రెండోసారి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే..  తాజాగా మెగాస్టార్ చిరంజీవి వెబ్ సిరీస్‌లో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌లో చాలా మంది నటీనటులు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నటిస్తున్నారు. అయితే బిగ్ స్టార్స్ మాత్రం ఎవరు దీనిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్డం లేదు. మరోవైపు అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్ వంటి వాళ్లు వెబ్ సిరిస్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో అగ్ర నటుడు  అక్షయ్ కుమార్.. అమెజాన్ ప్రైమ్‌లో నటించడానికి అగ్రిమెంట్ చేసాడు. ఇందులో నటించడానికి ఖిలాడీకి పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పినట్టు సమాచారం. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి కూడా వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జగపతి బాబు గ్యాంగ్ స్టర్స్‌ అనే వెబ్ సిరీస్ చేసాడు. అటు శ్రీకాంత్ కూడా ‘చదరంగం’ అనే వెబ్ సిరీస్‌లో అలరించాడు. ఇపుడు అదే బాటలో చిరంజీవి కూడా వెబ్  సిరీస్‌లో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

  megastar chiranjeevi will be act in web series speculation going on tollywood,Megastar chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi may act web series,chiranjeevi akshay kumar,web series chiranjeevi,chiranjeevi acharya,chiranjeevi ram charan koratala siva,chiranjeevi allu aravind aha web series,tollywood,telugu cinema,చిరంజీవి,చిరంజీవి వెబ్ సిరీస్,వెబ్ సిరీస్‌లో చిరంజీవి,చిరంజీవి సినిమాలు,చిరంజీవి కొరటాల శివ ఆచార్య,చిరంజీవి ఆహా అల్లు అరవింద్,ఆహా ఓటీటీలో చిరంజీవి
  OTT ఫ్లాట్‌ఫామ్‌లోకి చిరంజీవి (File/Photos)


  ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అందరి హీరోల ఆలోచనలు మారుతున్నాయి. మంచి కథ, కథనాలు ఉంటే వెబ్ సిరీస్‌లో నటించడానికి సిద్దం అంటున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ ఆహా ఫ్లాట్‌ఫామ్‌లో చిరంజీవి కోసం ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. మరి చిరంజీవి వెబ్ సిరీస్‌లో నటింప చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు.మరోవైపు సురేష్ బాబు కూడా తమ్ముడు వెంకటేష్‌తో వెబ్ సిరీస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

  chiranjeevi and venkatesh will be plan to act in web series,Megastar chiranjeevi,chiranjeevi twitter,venkatesh,venkatesh twitter,venkatesh chiranjeevi web series,venkatesh chiranjeevi may act web series,chiranjeevi instagram,chiranjeevi may act web series,chiranjeevi akshay kumar,web series chiranjeevi,chiranjeevi acharya,chiranjeevi ram charan koratala siva,chiranjeevi allu aravind aha web series,tollywood,telugu cinema,చిరంజీవి,చిరంజీవి వెబ్ సిరీస్,వెబ్ సిరీస్‌లో చిరంజీవి,చిరంజీవి సినిమాలు,చిరంజీవి కొరటాల శివ ఆచార్య,చిరంజీవి ఆహా అల్లు అరవింద్,ఆహా ఓటీటీలో చిరంజీవి
  సురేష్ బాబు, వెంకటేష్ (Twitter/Photo)


  ఇప్పటికే దీనికి సంబంధించిన కథలను రెడీ చేసే పనిలో ఉన్నాడు సురేష్ బాబు. ఇప్పటికే తేజ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.  మరోవైపు జయంత్ దర్శకత్వంలో మరో వెబ్ సిరీస్‌ నిర్మించడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం. మొత్తానికి మన హీరోలు .. కేవలం సినిమాలనే నమ్ముకోకుండా.. ఇపుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో కూడా సత్తా చూపెట్టడానికి రెడీ అవుతున్నారన్న మాట.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: