హోమ్ /వార్తలు /సినిమా /

Acharya Movie: ప్రి రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ముఖ్య అతిథులు ఎవరంటే?

Acharya Movie: ప్రి రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ముఖ్య అతిథులు ఎవరంటే?

‘ఆచార్య’లో చిరంజీవి,రామ్ చరణ్ (File/Photo)

‘ఆచార్య’లో చిరంజీవి,రామ్ చరణ్ (File/Photo)

ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో చిరుతో కలిసి రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. వీరిద్దరూ మాజీ నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు.

మెగాస్టార్ హీరోగా వస్తున్న మూవీ ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొరటాల శివ ( Koratala siva) దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, కాజోల్‌, పూజాహెగ్డే నటిస్తున్నారు. ఏప్రిల్‌ 29న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెంచింది ఆచార్య టీం.

అయితే ఆచార్య ప్రి రిలీజ్ వేడుకను ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మూవీ మేకర్. హైదరాబాద్‌లోనే ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇప్పటికే తేదీని కూడా ఫిక్స్ చేశారు. ఈనెల 24న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రిరిలీజ్‌కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చినట్లు సమాచారం. మరోవైపు మెగాస్టార్ సినిమా కావడంతో ప్రిరిలీజ్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు కూడా హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వేడుకకు చిరు బ్రదర్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు అతిథులుగా రావొచ్చనే టాక్‌ ఇండస్ట్రీలో నడుస్తోంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఆచార్య చిత్రాన్ని నిర్మించారు. సోనూసూద్, వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, అజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆచార్య సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఆచార్య సినిమా చిరంజీవి 152వ చిత్రం. కొరటాల శివ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విడుదల విషయంలో చాలా వాయిదాల తర్వాత.. ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రంలో చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) జోడిగా నటిస్తుండగా.. రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటిస్తున్నారు.

First published:

Tags: Aacharya, Acharya movie, Chiranjeevi