హోమ్ /వార్తలు /సినిమా /

సైరా ఎఫెక్ట్... చిరంజీవి ప్లాన్ ఫెయిల్

సైరా ఎఫెక్ట్... చిరంజీవి ప్లాన్ ఫెయిల్

తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Photo)

తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Photo)

బాహుబలి తరహాలోనే సైరా కూడా బాలీవుడ్‌లో మంచి ఫలితాలు రాబడుతుందని చిత్ర యూనిట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. తాము అనుకున్నట్టు జరిగితే... చిరంజీవికి జాతీయ స్థాయిలో ప్రభాస్ తరహాలో ఇమేజ్ వస్తుందని ఫ్యాన్స్ భావించారు.

చిరంజీవి నయా మూవీ సైరా మూవీ మంచి విజయాన్ని సాధించింది. మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్‌ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సైరా... తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో... మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేసిన సైరా... హిందీ, తమిళం సహా ఇతర భాషల్లో మాత్రం ఫెయిల్యూర్‌గా మిగిలిపోయింది. బాహుబలి తరహాలోనే సైరా కూడా బాలీవుడ్‌లో మంచి ఫలితాలు రాబడుతుందని చిత్ర యూనిట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. తాము అనుకున్నట్టు జరిగితే... చిరంజీవికి జాతీయ స్థాయిలో ప్రభాస్ తరహాలో ఇమేజ్ వస్తుందని ఫ్యాన్స్ భావించారు.

కానీ సైరా విషయంలో అలా జరగలేదు. దీంతో ఆ ఎఫెక్ట్ చిరంజీవి నటిస్తున్న తదుపరి సినిమాపై పడే అవకాశం ఉందని టాలీవుడ్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సైరా మూవీ బాలీవుడ్‌లో విజయం సాధిస్తే... కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కే సినిమాలోనూ ఎక్కువగా బాలీవుడ్, తమిళ స్టార్స్ నటించే అవకాశం ఉండేది. సైరా రిజల్ట్ ఎలా ఉంటుందో చూసిన తరువాతే స్టార్ కాస్టింగ్‌పై నిర్ణయం తీసుకోవాలని కొరటాల శివతో పాటు నిర్మాత రామ్ చరణ్ ఫిక్స్ అయ్యారు.

అయితే సైరా మూవీ తెలుగు మినహా ఇతర భాషల్లో అంతగా విజయం సాధించకపోవడంతో చిరంజీవి కొత్త సినిమా స్టార్ కాస్టింగ్‌లో మార్పులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఎక్కువగా టాలీవుడ్ స్టార్స్‌కే చిరంజీవి కొత్త సినిమాలో ఛాన్స్ ఉండొచ్చని... ఈ సారి బాలీవుడ్‌తో పాటు ఇతర భాషలకు చెందిన నటులకు అవకాశం పెద్దగా ఉండకపోవచ్చని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సైరా ఎఫెక్ట్... చిరంజీవి నయా మూవీపై ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.

First published:

Tags: Chiranjeevi, Koratala siva, Prabhas, Sye raa narasimhareddy, Tollywood

ఉత్తమ కథలు