Sye Raa | సైరా విషయంలో చిరంజీవి, రామ్ చరణ్ చేసిన పెద్ద తప్పు అదే..

Sye Raa Collections | సినిమాను ప్రమోట్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ చేసిన తప్పిదమే అందుకు కారణమని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

news18-telugu
Updated: October 8, 2019, 5:58 PM IST
Sye Raa | సైరా విషయంలో చిరంజీవి, రామ్ చరణ్ చేసిన పెద్ద తప్పు అదే..
సైరా సక్సెస్‌‌తో ఆనందలో చిరంజీవి, రామ్ చరణ్
news18-telugu
Updated: October 8, 2019, 5:58 PM IST
తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను ఆధారంగా తీసుకుని మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ దగ్గర బాగానే వసూళ్లు చేపడుతోంది. అయితే, మిగిలిన భాషల్లో మాత్రం అంతగా ప్రభావితం చేయలేకపోయింది. అంటే, ఎవరో తెలుగువారి సంగతి మనకెందుకులే అని ఇతర భాషల వారు అనుకున్నారు కాబట్టి.. అంతగా సినిమా ఆడట్లేదని చాలా మంది సినీ విశ్లేషకులు భావిస్తారు. అయితే, అసలు సినిమాను ప్రమోట్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ చేసిన తప్పిదమే అందుకు కారణమని మరికొందరు విశ్లేషిస్తున్నారు. సైరాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేయాలనే తాపత్రయం కనిపించింది. అయితే, అందుకు తగ్గ ప్లాన్ మాత్రం మెగా ఫ్యామిలీ ముందు నుంచి వర్కవుట్ చేయలేకపోయింది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఫస్ట్ లుక్, టీజర్లు, ట్రైలర్ లాంటివి రిలీజ్ చేసినా.. ఆయా భాషల నటులకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసినా.. అవి ప్రేక్షకులకు ఓ సినిమా వస్తుందన్న విషయాన్ని మాత్రమే గుర్తు చేశాయి. కానీ, సైరా అనే సినిమాలో ఏదో ఉండబోతోంది? చిరంజీవి ఏదో మాయ చేయబోతున్నాడు? ఓ గొప్ప సినిమాను భారతావనికి అందించబోతున్నాడనే అంశాన్ని తెలుగులో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినా, మిగిలిన భాషల్లో మాత్రం ఆ పనిచేయలేకపోయారు. సినిమా షూటింగ్ మొత్తం అయిపోయాక, మామూలుగా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే నిర్వహించారు.

బాహుబలి సినిమాను తీసుకుంటే, సినిమాలో హిందీ నటులు లేకపోయినా.. హిందీలో భారీ ఎత్తున ప్రమోట్ చేశారు. అసలు తెలుగులో ప్రమోషన్ గురించి రాజమౌళి కానీ, నిర్మాతలు కానీ పెద్దగా పట్టించుకోలేదు. అయినా, మీడియా ఇచ్చిన ప్రచారం వల్ల బాహుబలికి బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ తరహాలో.. రామ్ చరణ్ ప్లాన్ చేయలేకపోయాడు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి మధ్య మధ్యలో బాలీవుడ్‌కి వెళ్లి.. కొన్ని ప్రమోషన్స్ చేయడం.. ఓహో.. చిరంజీవి ఏదో మెగా ప్రాజెక్టుతో ముందుకొస్తున్నాడని.. అక్కడివారిని ఆకట్టుకోవడంలో విఫలమైనట్టే చెప్పుకోవాలి. కేవలం బాహుబలి హిట్ అయింది కాబట్టి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా హిట్ అవుతుందనే అభిప్రాయంతో మాత్రమే ముందడుగు వేసినట్టు కనిపిస్తోంది. పోనీ, మిగిలిన భాషలను పూర్తిగా వదిలేసి.. కేవలం తెలుగు మీదే దృష్టి పెట్టి ఉంటే, మెగాస్టార్‌ సినిమాకి మరింత కలెక్షన్లు వచ్చేవనడంలో ఎలాంటి సందేహం లేదు.



First published: October 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...