హోమ్ /వార్తలు /సినిమా /

మహేష్ బాబుకు చిరు సహా పలువురు సినీ ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు..

మహేష్ బాబుకు చిరు సహా పలువురు సినీ ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు..

మహేష్ బాబు చిరంజీవి (mahesh babu chiranjeevi)

మహేష్ బాబు చిరంజీవి (mahesh babu chiranjeevi)

ఈ రోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా మహేష్ బాబుకు చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

  ఈ రోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చేస్తోన్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ సందర్భంగా విడుదల చేసిన ‘సర్కారు వారి పాట’ సినిమా మోషన్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మహేష్ బాబు 45వ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబుకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేసారు.

  ఈ సందర్భంగా అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మీరు మరెన్నో మరిచిపోలేని పాత్రలు ముందు ముందు చేయాలని, మీ కలలను సాకారం చేసుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేశ్ అంటూ ట్వీట్ చేశారు. ఈ యేడాది మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చిరు ట్వీట్ చేశారు. ఈ యేడాది మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఆడియో ఫంక్షన్‌కు చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే కదా.

  మరోవైపు మహేష్ బాబు పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు.  హీరోలు శ్రీకాంత్, అడివి శేష్, అల్లరి నరేష్, మహేష్ బాబు అన్న సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, బండ్ల గణేష్, సంపూర్ణేష్ బాబు,  దర్శకులు పరశురామ్, అనిల్ రావిపూడి, శ్రీనువైట్ల, బాబీ, కోన వెంకట్,గోపీ మోహన్‌తో పాటు వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, శ్రీదేవి మూవీస్,కలైపులి ఎస్ థాను, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు పలు నిర్మాణ సంస్థలు కూడా మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలియజేసారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Chiranjeevi, Mahesh babu, Mythri Movie Makers, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు