Vijayashanti : విజయశాంతి.. తెలుగు వారికి పరిచయం అవసరం లేని స్టార్ హీరోయిన్. కొన్నాళ్లు రాజకీయాలతో బిజీగా గడిపిన విజయశాంతి.. ఇటీవలే మరోసారి మేకప్ వేసుకున్నారు.
Vijayashanti : విజయశాంతి.. తెలుగు వారికి పరిచయం అవసరం లేని స్టార్ హీరోయిన్. కొన్నాళ్లు రాజకీయాలతో బిజీగా గడిపిన విజయశాంతి.. ఇటీవలే మరోసారి మేకప్ వేసుకున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఆమె మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. అది అలా ఉంటే విజయశాంతి, చిరంజీవి జోడి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించింది. ఆ సూపర్ హిట్ జోడి చాలా ఏళ్ల తర్వాత మరోసారి కలిసి కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం పిరియాడిక్ చిత్రం 'సైరా నరసింహ రెడ్డి' చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
చిరంజీవి, విజయశాంతి Photo : Facebook
ఆ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్షన్లో ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు సిద్దమవుతున్నాడు. అయితే ఈ చిత్రంలో ఓ కీలక రోల్లో విజయశాంతి నటించనున్నారని సమాచారం. చిరు, విజయశాంతిలకు హిట్ పెయిర్ అన్న పేరుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో అప్పట్లో 19 సినిమాలు రాగా.. అందులో 10కి పైగా మంచి విజయాలుగా నిలిచాయి. చివరగా ఈ ఇద్దరూ 1993లో ‘మెకానిక్ అల్లుడు’లో కనిపించారు. అంటే దాదాపు 26 ఏళ్ల తర్వాత మరోసారి మెగాస్టార్‌తో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కలిసి నటించనున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.