• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MEGASTAR CHIRANJEEVI ALL SET TO DO VEDALAM REMAKE WITH MEHER REMESH VERY SOON PK

Chiranjeevi: మెహర్ రమేష్ నక్కతోక తొక్కాడబ్బా.. చిరంజీవిని ఒప్పించేసాడు..

Chiranjeevi: మెహర్ రమేష్ నక్కతోక తొక్కాడబ్బా.. చిరంజీవిని ఒప్పించేసాడు..

చిరంజీవి, మెహర్ రమేష్ (Chiranjeevi meher ramesh/Photo)

Chiranjeevi Meher Ramesh: మెహర్ రమేష్.. ఈ పేరు మరిచిపోయేంత ఈజీ కాదు.. మరిచిపోలేరు కూడా. ఎందుకంటే కొందరు దర్శకులు హిట్స్ ఇచ్చి చరిత్రలో నిలిచిపోతారు.

  • Share this:
మెహర్ రమేష్.. ఈ పేరు మరిచిపోయేంత ఈజీ కాదు.. మరిచిపోలేరు కూడా. ఎందుకంటే కొందరు దర్శకులు హిట్స్ ఇచ్చి చరిత్రలో నిలిచిపోతారు. కానీ ఈయన మాత్రం ఒకదాన్ని మించి మరో ఫ్లాప్ ఇచ్చి చరిత్రలో నిలిచిపోయాడు. పాపం కన్నడ ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్స్ అందుకున్న మెహర్ రమేష్.. తెలుగులో మాత్రం చతికిలపడ్డాడు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో కంత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత బిల్లా, శక్తి, షాడో సినిమాలు చేసాడు. అన్ని సినిమాలకు అడ్రస్ గల్లంతయింది.

జూనియర్ ఎన్టీఆర్ శక్తి (Jr NTR Shakthi)
జూనియర్ ఎన్టీఆర్ శక్తి (Jr NTR Shakthi)


దాంతో ఈయన అడ్రస్ కూడా మరిచిపోయారు నిర్మాతలు. ఏడేళ్లుగా అసలు మెహర్ రమేష్ అనే ఓ దర్శకుడు ఉన్నాడనే సంగతి కూడా మన నిర్మాతలు గుర్తు పెట్టుకోలేదు. హీరోలు అయితే అటు వైపుగా కూడా వెళ్లట్లేదు. మధ్యలో రవితేజతో సినిమా కోసం మ్యాగ్జిమమ్ ట్రై చేసినా కూడా కుదర్లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు ఈయన. కొడితే ఏనుగు కుంభస్థలమే అన్నట్లు ఏకంగా ఈయనకు మెగాస్టార్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. దాంతో గాల్లో తేలిపోతున్నాడు.

చిరంజీవి మెహర్ రమేష్ (meher ramesh chiranjeevi)
చిరంజీవి మెహర్ రమేష్ (meher ramesh chiranjeevi)


ఈ ప్రాజెక్ట్‌పై చాలా రోజులుగా వార్తలు వస్తున్నా కూడా మెగా ఫ్యాన్స్ మాత్రం కన్ఫర్మ్ అయ్యే వరకు నమ్మేది లేదంటూ భీష్మించుకూర్చున్నారు. మెహర్ రమేష్‌తో సినిమా అనగానే అభిమానుల్లో ఏదో తెలియని భయం అయితే మొదలైంది. ఇప్పుడు అదే నిజమైపోయింది కూడా. నిజంగానే మెహర్ రమేష్‌తో చిరంజీవి సినిమా చేయబోతున్నాడు. అయితే మెగాస్టార్ నమ్మాడంటే మెహర్ రమేష్ ఏదో మాయ చేసుంటాడని అభిమానులు సర్ది చెప్పుకుంటున్నారు.

చిరంజీవి అజిత్ (chiranjeevi ajith)


పైగా అది స్ట్రెయిట్ సినిమా కాదు కాబట్టి ధైర్యంగానే కనిపిస్తున్నారు. తమిళనాట హిట్ అయిన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు మెహర్ రమేష్. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైపోయింది. ఇది కూడా సింగిల్ సిట్టింగ్‌లోనే చిరంజీవిని మెహర్ రమేష్ ఒప్పించాడని ప్రచారం జరుగుతుంది. ఆయన మేకింగ్ ఎలా ఉన్నా కూడా స్క్రిప్ట్ చెప్పే విధానం మాత్రం అదిరిపోతుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకే అన్ని ఫ్లాపులు వచ్చినా కూడా అవకాశాలు అందుకున్నాడు మెహర్ రమేష్.

చిరంజీవి,సాయి పల్లవి (File/Photo)
చిరంజీవి,సాయి పల్లవి (File/Photo)


ఇప్పుడు కూడా వేదాళం సినిమా కథను చిరు ఇమేజ్‌కు తగ్గట్లు మార్చేస్తున్నాడు మెహర్. కచ్చితంగా ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతానంటూ ధీమాగా చెప్తున్నాడు ఈ దర్శకుడు. సాయి పల్లవి ఇందులో చిరంజీవి చెల్లిగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published: