మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మిగిలిన సీనియర్ హీరోలు కనీసం రేసులో కూడా అందుకోనంత బిజీగా ఉన్నాడు ఈయన. ఒకటి రెండు కాదు నాలుగు సినిమాలు కన్ఫర్మ్ చేసాడు మెగాస్టార్. రాబోయే నాలుగు సినిమాలకు సంబంధించిన దర్శకులతో కూడా ఫోటోలు దిగి పోస్ట్ చేసాడు చిరంజీవి. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరు నటిస్తున్న ఆచార్య సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. రామ్ చరణ్ కూడా తొలిసారి ఈ చిత్ర షూటింగ్లో అడుగు పెట్టాడు. ఇందులో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే పాత్రలో నటిస్తున్నాడు రామ్ చరణ్. మరోవైపు చిరు కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. భారీ అంచనాలతో వచ్చిన సైరా సినిమా కేవలం యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. తెలుగులో తప్ప ఈ చిత్రం మిగిలిన అన్ని భాషల్లోనూ డిజాస్టర్ అయింది. దాంతో ఇప్పుడు ఆచార్యతో సెన్సేషనల్ హిట్ కొట్టి తన స్థాయేంటో చూపించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాడు మెగాస్టార్. ఈ చిత్రంలో ఈయన నక్సలైట్‌గా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు రామ్ చరణ్ కూడా నక్సలైట్‌గానే నటిస్తున్నాడని తెలుస్తుంది. ఆచార్య సినిమాను చిరు సతీమణి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

’ఆచార్య’ సిద్ధ పాత్రలో రామ్ చరణ్ (Twitter/Photo)
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన ఎపిసోడ్స్ హైదరాబాద్‌లోనే షూట్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇదిలా ఉంటే ఈ చిత్ర కథేంటి అనేది మోషన్ పోస్టర్లోనే కథేంటి చెప్పేసాడు దర్శకుడు. ఇప్పుడు టీజర్లో ఏం చెప్తాడనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ టీజర్లో రామ్ చరణ్ కనిపిస్తాడా లేదా అనేది అనుమానమే. సినిమా అంతా దేవాదాయ భూముల స్కాం చుట్టూనే తిరగనుంది. ఈ సినిమాలో దాదాపు అరగంట పాటు చరణ్ ఉంటాడు.

కొరటాల శివ రామ్ చరణ్ (ram charan koratala siva)
అంతేకాదు చిరు, చరణ్ స్క్రీన్ స్పేస్ కూడా భారీగానే ఉండబోతుంది. అయితే టీజర్లో మాత్రం చరణ్‌ను రివీల్ చేయకూడదని కొరటాల భావిస్తున్నాడు. నేరుగా థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ బాగుంటుందని దర్శక నిర్మాతలు కూడా భావిస్తున్నారు. ఆచార్య టీజర్ ఫిబ్రవరిలో విడుదల కానుందని తెలుస్తుంది. సినిమా మేలో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:January 23, 2021, 20:35 IST