• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • MEGASTAR CHIRANJEEVI ACHARYA MOVIE PRE RELEASE BUSINESS AND HERE THE DETAILS PK

Chiranjeevi Acharya: ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ బిజినెస్.. చిరంజీవి చించేస్తున్నాడు బాబోయ్..!

’ఆచార్య’లో చిరంజీవి (Twitter/Photo)

Chiranjeevi Acharya: మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు బిజినెస్ ఎలా జరుగుతుంది అని అడక్కూడదు.. ఎన్ని రికార్డులు బద్ధలవుతున్నాయ్ అని అడగాలి. ఇప్పుడు ఆచార్య సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న..

  • Share this:
మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు బిజినెస్ ఎలా జరుగుతుంది అని అడక్కూడదు.. ఎన్ని రికార్డులు బద్ధలవుతున్నాయ్ అని అడగాలి. ఇప్పుడు ఆచార్య సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సైరా సినిమా కొన్ని వర్గాలను మాత్రమే ఆకట్టుకుంది. తెలుగులో యావరేజ్ దగ్గరే ఆగి.. మిగిలిన భాషల్లో ఫ్లాప్ అయింది. దాంతో సైరా లోటు కూడా ఇప్పుడు తీర్చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్. అందుకే ఆచార్య కోసం టైమ్ ఎంత తీసుకున్నా పర్లేదు కానీ పక్కా స్క్రిప్ట్ కావాలని ముందు నుంచి కొరటాలకు కండీషన్ పెట్టాడు చిరంజీవి. అనుకున్నట్లుగానే మెగాస్టార్ మనసు దోచేలా ఆచార్య తెరకెక్కిస్తున్నాడు కొరటాల. మరో నెల రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. మే 13న విడుదల కానుంది ఆచార్య. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దుమ్ము దులిపేస్తున్నాడు మెగాస్టార్. చిరు గత సినిమాల రికార్డులన్నీ తిరగరాసేలా కుమ్మేస్తున్నాడు అన్నయ్య. నైజాంలో ఇప్పటికే వరంగల్ శ్రీను 42 కోట్లకు రైట్స్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆంధ్రా, సీడెడ్ కలిపి 60 కోట్లకు పైగానే ఆచార్య బిజినెస్ జరుగుతుంది. మరోవైపు ఓవర్సీస్ కూడా అన్నయ్య రేంజ్‌కు ఏ మాత్రం తీసిపోవడం లేదు. అక్కడా ఆచార్య అదరగొడుతున్నాడు.

acharya movie,chiranjeevi acharya movie,acharya movie pre release business,acharya movie nizam rights 42 crore warangal srinu,acharya movie pre release business,chiranjeevi acharya movie,acharya movie teaser reactions,telugu cinema,ఆచార్య,ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్,ఆచార్య ఓవర్సీస్ రైట్స్,ఆచార్య నైజాం రైట్స్ 42 కోట్లు
ఖైదీ నెం 150 (Khaidi no 150)


ఖైదీ నెం 150, సైరా సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి వసూళ్లే రావడంతో ఇప్పుడు ఆచార్యకు కూడా అదే స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. 20 కోట్లకు పైగానే ఓవర్సీస్ రైట్స్ నిర్మాతలు కోట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే కానీ నిజమైతే ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్ల వరకు జరుగుతున్నట్లే లెక్క. అంటే ఈ సినిమా హిట్ కొట్టాలంటే 150 కోట్ల వరకు షేర్ వసూలు చేయాలి. ఇప్పటి వరకు బాహుబలి కాకుండా అల వైకుంఠపురములో మాత్రమే ఈ రికార్డు అందుకుంది. ఇప్పుడు మెగాస్టార్ కూడా ఈ ఫీట్ చేస్తాడో లేదో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: