HOME »NEWS »MOVIE »megastar chiranjeevi acharya movie inspired by that real incident mhn

Chiranjeevi - Aacharya: ఆ నిజ ఘ‌ట‌నే మెగాస్టార్ ‘ఆచార్య’‌కు ఇన్‌స్పిరేష‌నా?

Chiranjeevi - Aacharya: ఆ నిజ ఘ‌ట‌నే మెగాస్టార్ ‘ఆచార్య’‌కు ఇన్‌స్పిరేష‌నా?
Megastar Chiranjeevi Acharya movie inspired by that real incident

Chiranjeevi - Aacharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ఆచార్య చిత్ర కథను డైరెక్టర్ కొరటాల శివ కొన్ని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    సాధార‌ణంగా కొంత మంది ద‌ర్శ‌కులు సందేశాత్మ‌క చిత్రాలు చేస్తే.. కొంద‌రు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే చేస్తారు. అయితే అతి కొద్ది మంది ద‌ర్శ‌కులు మాత్ర‌మే క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మిక్స్ చేసి సందేశాత్మ‌క చిత్రాలు చేస్తారు. అలాంటి వారిలో డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ముందు వ‌రుస‌లో ఉంటాడు. ఈయ‌న చేసిన శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, భ‌ర‌త్ అనే నేను సినిమాల‌ను చూస్తే చాలు.. త‌న మేకింగ్ స్టైల్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఎక్క‌డో నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాల‌ను తెర‌కెక్కించిన‌ట్లు మ‌న‌కు అర్థం అవుతుంది. ప్ర‌స్తుతం కొర‌టాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. దేవాదాయ శాఖ‌లో జ‌రిగిన అవినీతిని ప్ర‌శ్నించేలా సినిమాను కొర‌టాల తెర‌కెక్కిస్తున్నాడ‌నే సంగ‌తి అందిర‌కీ తెలిసిందే. సినిమా కోసం ఇండియాలో అతి పెద్దదైన టెంపుల్ సెట్‌ను వేసి చిత్రీక‌రిస్తున్నారు.

    అయితే ఆచార్య సినిమా క‌థ‌ను కొర‌టాల శివ రాసుకోవ‌డం వెనుక ఓ నిజ ఘ‌ట‌న ఉంద‌ట‌. త‌మిళ‌నాడులో ధ‌ర్మ‌పురి ప్రాంతంలోని దేవాల‌య భూములు అన్యాక్రాంత‌మ‌య్యాయి. అప్ప‌ట్లో అది సెన్సేష‌న్ కూడా అయ్యింది. దీన్ని బేస్ చేసుకునే కొర‌టాల క‌థ‌ను రాసుకున్నాడట‌. అక్క‌డ‌నే కాదు.. నిజానికి చాలా చోట్ల దేవాల‌యాల‌కు సంబంధించిన భూములు బ‌డా వ్య‌క్తులు ఆక్ర‌మించుకున్నారు. ఇలాంటి పాయింట్స్‌ను ప్ర‌శ్నించేలా ఆచార్య సినిమా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది.



    ఇందులో మెగాస్టార్ చిరంజీవి మాజీ న‌క్స‌లైట్ పాత్ర‌లో క‌నిపిస్తాడు. పాత్ర‌లోనూ రెండు షేడ్స్ ఉంటాయి. అలాగే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అయిన న‌క్స‌లైట్ లీడ‌ర్‌గా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తాడు. సోనూసూద్ విల‌న్‌గా న‌టించాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది.
    Published by:Anil
    First published:January 05, 2021, 21:54 IST