HOME »NEWS »MOVIE »megastar chiranjeevi acharya first look poster and motion poster released ta

Chiranjeevi: పుట్టినరోజున అభిమానులకు చిరంజీవి సర్ఫ్రైజ్ గిప్ట్..

Chiranjeevi: పుట్టినరోజున అభిమానులకు చిరంజీవి సర్ఫ్రైజ్ గిప్ట్..
’ఆచార్య’ మూవీ ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖరారు (ITwitter/Photo)

Chiranjeevi Acharya First Look: ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి, కొరటాల శివ మూవీకి సంబంధించిన ‘ఆచార్య’ మూవీ ఫస్ట్ లుక్‌కు ముహూర్తం ఖరారైంది.

  • Share this:
    Chiranjeevi Acharya First Look: ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి, కొరటాల శివ మూవీకి సంబంధించిన ‘ఆచార్య’ మూవీ ఫస్ట్ లుక్‌కు ముహూర్తం ఖరారైంది. చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న సాయంత్రం 4 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో హీరో చేతిలో ఎర్రటి కండువా ఉంది. చూస్తుంటే.. ఈ చిత్రాన్ని దేవాదాయ, ధర్మదాయ శాఖలో పనిచేసే ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు నక్సలైట్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.


    దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన  సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్.   ఈ  సినిమాలో మరో కీలక పాత్ర కోసం రామ్ చరన్ లేదా రానాను అనుకుంటున్నారు. ఇంకోవైపు చిరంజీవి ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆచార్య పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

    చిరంజీవి,కొరటాల శివ (Chiranjeevi Koratala Siva)
    చిరంజీవి, కొరటాల శివ (Chiranjeevi Koratala Siva)


    కరోనా లాక్‌డౌన్ రాకపోయి ఉంటే.. ఈ పాటికి ఈ సినిమా విడుదలై ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్ ఇచ్చినా.. కరోనా మహామ్మారి ఎవరి నుంచి ఎవరికీ ఎలా సోకుతుందే చెప్పడం కష్టమే. వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా కోసం కొరటాల శివ ప్రత్యేకంగా క దేవాలయం సెట్‌ను రూపొందించే పనిలో ఉన్నాుడ. మొన్నటి వరకు ఏదైనా పెద్ద దేవాలయంలో ఈ సినిమా షూటింగ్ చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోవడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్ శివారులో ప్రత్యేకంగా ఒక దేవాలయం సెట్‌ను రూపొందించే పనిలో పడింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:August 18, 2020, 17:32 IST

    टॉप स्टोरीज