• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MEGASTAR CHIRANEJEVI ONE LACK RUPEES FINANCIAL HELP TO JOURNALIST TNR FAMILY WHO DIED WITH COVID PK

Chiranjeevi help to TNR family: జర్నలిస్ట్ TNR కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయం..

Chiranjeevi help to TNR family: జర్నలిస్ట్ TNR కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయం..

టిఎన్ఆర్ కుటుంబానికి చిరు సాయం (TNR Chiranjeevi)

Chiranjeevi help to TNR family: యూ ట్యూబ్ యాంకర్,. నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు.  మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చిన టీఎన్ఆర్ తనదైన మార్గాన్ని ఎంచుకుని ఎదిగారు.

  • Share this:
యూ ట్యూబ్ యాంకర్,. నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు.  మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చిన టీఎన్ఆర్ తనదైన మార్గాన్ని ఎంచుకుని ఎదిగారు. టీఎన్ఆర్ మరణవార్త తెలిసిన మెగాస్టార్ చిరంజీవి తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం టీఎన్ఆర్ భార్యా పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు. దాంతోపాటు లక్ష రూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు. టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, తను ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకునేదని గుర్తుచేశారు. జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కుటుంబానికి ఎలాంటి అవసరమొచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

మీరంటే వీరాభిమానం: చిరుతో టీఎన్ఆర్ భార్య
tnr chiranjeevi,chiranjeevi help to tnr family,chiranjeevi one lack rupees to tnr family,journalist tnr family chiranjeevi,telugu cinema,జర్నలిస్ట్ టిఎన్ఆర్,జర్నలిస్ట్ TNR కుటుంబానికి లక్ష సాయం చేసిన చిరంజీవి
టిఎన్ఆర్ కుటుంబానికి చిరు సాయం (TNR Chiranjeevi)

‘మీరంటే వీరాభిమానం సార్. తన 200వ ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారు. ఇంతవరకు మిమ్మల్ని కలవలేదు. మీరు మాకిలా ఫోన్ చేయడం ఎంతో సంతోషం కలిగించింది’ ఈ మాటలు మరెవరివో కాదు టీఎన్ఆర్ సతీమణివి. ఆమె భర్త మరణించిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ఆమెకు ఫోన్ చేసి పరామర్శించగానే ఆమె అన్న మాటలివి. తమ కుటుంబానికి లక్ష రూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు