MEGASTAR CHIRAJEEVI LUCIFER REMAKE VV VINAYAK OUT AND HARISH SHANKAR WILL TAKE UP THIS REMAKE TA
Chiranjeevi: చిరంజీవి లూసీఫర్ రీమేక్ నుంచి వినాయక్ ఔట్.. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసే దర్శకుడు ఎవరంటే..
చిరు ’లూసీఫర్’ రీమేక్ బాధ్యతల నుంచి తప్పుకున్న వినాయక్ (File/Photo)
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలకు ఓకే చెప్పేస్తున్నాడు. అందులో మలయాళంలో హిట్టైన ‘లూసీఫర్’ రీమేక్ ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని సుజీత్ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత వినాయక్ చేతుల్లోకి వెళ్లింది. పైనల్గా వినాయక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మరో క్రేజీ డైరెక్టర్ చేతుల్లోకి ‘లూసీఫర్’ రీమేక్ బాధ్యతలు వెళ్లినట్టు సమాచారం.
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలకు ఓకే చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివతో చేస్తున్న ఆచార్య షూటింగ్ మాత్రం నవంబర్ 9 నుంచి మొదలైది. ఈ లోపు చిరంజీవికి కరోనా పాజిటివ్ అని మెగాస్టార్ స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత కోవిడ్ లక్షణాలు లేకపోవడంతో వెంటనే మరోసారి చెకప్ చేయించుకుంటే.. కరోనా లేదని నిర్ధారణ అయింది. కరోనా టెస్ట్ చేసే కిట్ ప్రాబ్లెమ్ వల్లే ఇదంత జరిగిందని చిరు చెప్పుకొచ్చారు. కొరటాల శివతో చేస్తోన్న సినిమా మాత్రమే డైరెక్ట్ స్టోరీ. ఆ తర్వాత చేయబోయే సినిమాలన్ని రీమేక్ సినిమాలే కావడం విశేషం. ఇప్పటికే అన్ని సినిమాలకు సంబంధించిన కథలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ ఏజ్‌లో కొత్త కథలతో రిస్క్ చేయడం కంటే ఒక భాషలో ప్రూవ్ కథతో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ వుంటుందన్న ఉద్దేశ్యంతో చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలకు ఓకే చెబుతున్నాడు. ముఖ్యంగా చిరు ప్రస్తుతం లూసీఫర్, వేదాళం రీమేక్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో వేదాళం కోసం మెహర్ రమేష్ ఫిక్స్ అయ్యాడు. ఆయన కథను కూడా సిద్ధం చేసాడు. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లు మెహర్ చేసిన మార్పులకు మెగాస్టార్ ఓకే కూడా చేసేసారు. త్వరలోనే ఈ సినిమా మొదలు కానుంది.
చిరంజీవి అజిత్ (chiranjeevi ajith)
ఇందులో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో తమిళనాట శివ తెరకెక్కించిన ఈ సినిమా మాస్ హిట్ అయింది. ఇదే సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నాడు మెహర్ రమేష్. వేదాళం విషయంలో క్లారిటీగా ఉన్న చిరు.. లూసీఫర్ రీమేక్ విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఈ చిత్ర దర్శకుడి విషయంలో ముందు నుంచి కూడా ఎక్కడో క్లారిటీ మిస్ అవుతూ వస్తుంది. లూసీఫర్ రీమేక్‌కు ముందు సుజీత్‌ను దర్శకుడిగా తీసుకున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత సుజీత్‌ను కాదని వినాయక్‌ను తీసుకున్నాడు చిరంజీవి.
చిరంజీవి వినాయక్ (Chiranjeevi Vinayak Lucifer movie remake)
తాజాగా వినాయక్ చెప్పిన నేరేషన్ కూడా చిరంజీవికి నచ్చలేదట. ఆ తర్వాత బాబీ కూడా ఈ కథను తనదైన ట్రీట్మెంట్తో చిరును కలిస్తే.. అతని చెప్పిన విధానాకి కూడా చిరు సంతృప్తి వ్యక్త పరచలేదట. తాజాగా లూసీఫర్ రీమేక్ బాధ్యతలను చిరంజీవి.. హరీష్ శంకర్ చేతిలో పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు అఫీషియల్ ప్రకటన కూడా వెలుబడింది. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలంటే.. పవన్ కళ్యాణ్ ముందుగా..వకీల్ సాబ్ మూవీ, ఆ తర్వాత క్రిష్‌తో చేయబోయే సినిమాలతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలు తర్వాత హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ లోపు హరీష్ శంకర్‌తో చిరు ..’లూసీఫర్’ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడట.
చిరంజీవి,హరీష్ శంకర్ (File/Photo)
ఇక హరీష్ శంకర్ కూడా రీమేక్స్ను తెలుగు నేటివిటికి తగ్గట్టు తెరకెక్కించడంతో మంచి ఎక్స్పర్ట్. ఇప్పటికే దబాంబ్ సినిమాను ‘గబ్బర్ సింగ్‌గా.. తమిళ ‘జిగర్తాండ’ సినిమాను ‘గద్దలకొండ గణేష్‌గా రీమేక్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే చిరు.. తన లూసీఫర్ రీమేక్‌ను హరీష్ శంకర్ చేతిలో పెట్టడానికి రెడీ అయినట్టు సమాచారం. ఈ రీమేక్ విషయమై హరీష్ శంకర్ పేరు అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.