హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan - Megastar chiranjeevi: అప్పా ఆచార్య గురించి రామ్ చరణ్ ఎమోషనల్ వీడియో.. చూస్తే వావ్ అనాల్సిందే!

Ram Charan - Megastar chiranjeevi: అప్పా ఆచార్య గురించి రామ్ చరణ్ ఎమోషనల్ వీడియో.. చూస్తే వావ్ అనాల్సిందే!

ఆచార్య: విడుదల ఫిబ్రవరి 4

ఆచార్య: విడుదల ఫిబ్రవరి 4

Ram Charan - Megastar chiranjeevi: నేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. సోషల్ మీడియాలో మెగాస్టార్ బర్త్ డేని ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అభిమానుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతిఒక్కరు మెగాస్టార్ కు ఎంతో గొప్పగా విష్ చేశారు.

ఇంకా చదవండి ...

  Ram Charan - Megastar chiranjeevi: నేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. సోషల్ మీడియాలో మెగాస్టార్ బర్త్ డేని ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అభిమానుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతిఒక్కరు మెగాస్టార్ కు ఎంతో గొప్పగా విష్ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం అని పవన్ కళ్యాణ్ ట్విట్ చెయ్యగా.. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే.. అంత అద్భుతంగా ఉంది.

  మై అప్పా.. మై ఆచార్య అంటూ షేర్ చేసిన ఈ వీడియోలో.. ఆచార్య సినిమా కోసం రామ్ చరణ్, మెగాస్టార్ కలిసి చేసిన జర్నీ వీడియోను.. అక్కడ మెగాస్టార్ కష్టపడినా వీడియోను.. రామ్ చరణ్ గురించి తీసుకున్న కేర్ అంత చూస్తే.. నిజంగానే మెగాస్టార్ చిరంజీవి మెగా డాడీలా.. కాదుకాదు.. మెగా సూపర్ డాడీలా కనిపిస్తాడు. హ్యాపీ బర్త్ డే అప్పా ఆచార్య అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విష్ చేశాడు. మరి మీరు ఆ వీడియోను చూశారా.. ఎంత బాగుందో!


  కాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వేదాళం రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు ''బోళా శంకర్‌'' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతుండగా ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ సినిమా వేదాళం రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇందులో కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా నటిస్తుంది.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Acharya, Megastar Chiranjeevi, Ram Charan, Tollywood

  ఉత్తమ కథలు