Home /News /movies /

MEGA STAR CHIRANJEEVI WATCHES FIRST RUSH CUT OF RRR AND APPRICIATES RAJAMOULI MHN

RRR - Rajamouli - Chiranjeevi: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చూసిన మెగాస్టార్.. ఫస్ట్ రియాక్షన్ ఇదీ..!

Mega Star Chiranjeevi watches first rush cut of RRR and appriciates Rajamouli

Mega Star Chiranjeevi watches first rush cut of RRR and appriciates Rajamouli

RRR - Rajamouli - Chiranjeevi: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఫస్ట్ రష్ కట్‌ను మెగాస్టార్ చిరంజీవి చూశాడు. ఆయన రియాక్షన్ ఏంటో తెలుసా..

    ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి అలియాస్ జక్కన్న దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో చెర్రీ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాలో ఇంటర్నేషనల్ స్థాయి ఉన్న నటీనటులను జక్కన్న తీసుకున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మరోవైపు ఫస్ట్ లుక్స్, గ్లిమ్స్ అయితేనేం అదిరిపోయాయి. సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా..? అని వేయికళ్లతో సినీ ప్రియులు.. ఇటు నందమూరి ఫ్యాన్స్, అటు మెగా ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.

    దుమ్ములేపేశావ్ జక్కన్నా..!
    ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్‌-13న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే దాదాపు షూటింగ్.. మరోవైపు ఎడిటింగ్ కూడా దాదాపు అయిపోవడంతో అసలు సినిమా ఎలా ఉందో..? చూడాలని టాలీవుడ్ పెద్దన్న, మెగాస్టార్ చిరంజీవికి జక్కన్న చూపించారట. ఈ సినిమాలో కొన్ని కొన్ని కీలకమైన సీన్లను మాత్రమే తిలకించిన మెగాస్టార్.. వావ్ అదిరిపోయిందంటూ కితాబిచ్చారట. నిజంగా ఇంతవరకూ ‘బాహుబలి’ సినిమా అనుకుంటే అంతకంటే మించిపోయిందంటూ జక్కన్నను పొగడ్తలతో ముంచెత్తారట. ఇక చెర్రీ, ఎన్టీఆర్ యాక్టింగ్‌ల గురించి మాట్లాడుతూ.. అసలు ఈ రేంజ్‌లో వీరిద్దర్నీ చూపిస్తావని అనుకోలేదని.. నిజంగా దుమ్మెలేపేశావ్ పో అంటూ తన ఆనందాన్ని రాజమౌళి, తన అత్యంత సన్నిహితులతో చిరు పంచుకున్నారట.

    చరిత్ర సృష్టించడం ఖాయం!
    వాస్తవానికి మెగాస్టార్ తన సినిమాల విషయంలో అంత సీరియస్‌గా తీసుకుంటారో లేదో గానీ చెర్రీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే రిలీజ్‌కు ముందే కచ్చితంగా.. అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే సినిమా చిరుకు చూపించి తీరాల్సిందే. అందుకే తాజాగా.. మెగాస్టార్‌కు జక్కన్న సినిమా చూపించక తప్పలేదు. సినిమాలోని కొన్ని కొన్ని కీలక సీన్లను మాత్రమే చూసిన సంబరపడిపోయిన చిరు.. ఇక సినిమా మొత్తం చూస్తే చిరు ఎలా రియాక్ట్ అవుతారో ఇక చెప్పక్కర్లేదేమో. కాగా.. ‘మగధీర’ సినిమా విషయంలోనూ మెగాస్టార్ ఇలానే చూసి కచ్చితంగా ఎవరూ ఊహించని రీతిలో సూపర్ హిట్టవుతుందని చెప్పారు.. అన్నట్లుగానే సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. తాజాగా.. ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత కూడా పక్కాగా చరిత్ర సృష్టించడం ఖాయమని మెగాస్టార్ చెప్పాడట. ఒక్క చిరు అన్నారనే కాదు కానీ ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయ్.. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ మూవీ ఏ మాత్రం రికార్డులు బద్దలుగొడుతుందో వేచి చూడాలి.
    Published by:Anil
    First published:

    Tags: Chiranjeevi, Rrr movie, SS Rajamouli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు