హోమ్ /వార్తలు /సినిమా /

Brahmanandam: రంగమార్తాండలో బ్రహ్మానందం నటన అద్భుతం.. బ్రహ్మీకి చిరు అభినందనలు..

Brahmanandam: రంగమార్తాండలో బ్రహ్మానందం నటన అద్భుతం.. బ్రహ్మీకి చిరు అభినందనలు..

రంగమార్తాండలో బ్రహ్మా యాక్టింగ్‌కు చిరు, రామ్ చరణ్ ఫిదా (Twitter/Photo)

రంగమార్తాండలో బ్రహ్మా యాక్టింగ్‌కు చిరు, రామ్ చరణ్ ఫిదా (Twitter/Photo)

Brahmanandam: చాలా కాలం తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘రంగమార్తాండ’. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇందులో బ్రహ్మాని ఇదివరకు ఎపుడు చూడని పాత్రలో కనిపించి వావ్ అనిపించారు. తాజాగా ఇందులో బ్రహ్మాని నటనను చిరంజీవి మెచ్చుకుని సత్కరించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Brahmanandam: టాలీవుడ్‌లో ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న ‘కృష్ణ వంశీ’ నుంచి వచ్చిన తాజా సినిమా రంగమార్తండ. కరోనాకు ముందుకు ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో ఒడిదుడుకులతో చివరకు షూటింగ్ కంప్లీటైంది. దాదాపు నాలుగైదేళ్లుగా కృష్ణవంీ ఈ సినిమా కోసం పనిచేసాడు. మరాఠీలో నానా పాటేకర్ హీరోగా నటించిన ‘నట సమ్రాట్’ మూవీకి తెలుగు రీమేక్ ‘రంగమార్తాండ’. మరి మరాఠీ ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాకు తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో రంగస్థల నటుడిగా ప్రకాష్ రాజ్ నటనతో పాటు బ్రహ్మా యాక్టింగ్‌కు ఫిదా కానీ వారు ఎవరు ఉండరు. ఎపుడు నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే బ్రహ్మానందం ఈ సినిమాలో ఏడిపించేసాడు. ఇందులో బ్రహ్మాలోని కొత్త నటుడిని చూసి కామన్ ఆడియన్స్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి.

తాజాగా రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు ఫిదా అయిన చిరంజీవి.. బ్రహ్మిని ప్రత్యేకంగా సత్కరించారు.  అంతేకాదు ఇప్పటి వరకు ఎవరు చూడని బ్రహ్మానందంను ఈ సినిమాలో చూసినట్టు చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మాని చిరు, రామ్ చరణ్‌లు కలిసి  శాలువతో సత్కరించారు.

ఇక బ్రహ్మానందం విషయానికొస్తే.. తెరపై ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకులకు ఆటోమేటిక్‌గా కితకితలు వచ్చేస్తాయి. అలాంటి బ్రహ్మా.. రంగమార్తాండలో కామెడీతో సీరియస్ పాత్రను ఎంతో హుందాగా నటించి మెప్పించారు.  తన కెరీర్ లో తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ మూవీలో ఒక సీరియస్ రోల్‌లో కనిపించారు బ్రహ్మానందం. ఉగాది సందర్భంగా విడుదలైన రంగమార్తాండ మంచి మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్‌లో రన్ అవుతోంది. సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ బ్రహ్మానందం నటనకు ముగ్దులవుతున్నారు. ఇన్నాళ్లు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇలా ఏడిపించేశారు ఏంటి? అని అనుకుంటున్నారు. థియేటర్లో బ్రహ్మానందం సీన్లకు ప్రతీ ఒక్క ఆడియెన్ కంటతడి పెట్టేసుకుంటారు.

First published:

Tags: Brahmanandam, Chiranjeevi, Krishna vamsi, Ram Charan, Tollywood

ఉత్తమ కథలు