Home /News /movies /

MEGA STAR CHIRANJEEVI MADE SOME INTERESTING COMMENTS ON ANDHRA PRADESH AND TELANGANA GOVERNMENTS ABOUT THIS ISSUE SRD

Chiranjeevi : కేసీఆర్, జగన్ ప్రభుత్వాలపై చిరంజీవి సీరియస్.. వాటిని మరిచారంటూ సంచలన వ్యాఖ్యలు..

MegaStar Chiranjeevi

MegaStar Chiranjeevi

Chiranjeevi : ఆ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారా..? సున్నితంగానే రాష్ట్ర ప్రభుత్వాల్ని విమర్శించారా..? లేటెస్ట్ గా చిరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయ్.

    మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అలాగే ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ డైరెక్షన్‌లో భోళా శంకర్, అలాగే బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు మెగాస్టార్. అయితే, లేటెస్ట్ గా చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయ్. ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తరపున సినిమాలకి అవార్డులు ఇస్తారు. ప్రతి సంవత్సరం అధికారికంగా ఈ వేడుకని నిర్వహిస్తారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సినిమా కళాకారులకి నంది అవార్డులు ఇచ్చేవారు. రాష్ట్రం విడిపోయాక ఒక రెండు సంవత్సరాలు అవార్డుని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత అవార్డుల గురించే మర్చిపోయారు. అటు ఏపీ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అధికారికంగా ఎటువంటి అవార్డుల ఫంక్షన్ ని నిర్వహించలేదు ఇప్పటి వరకు. దీనిపై చిరంజీవి, నాగార్జున మరి కొంతమంది సినీ పెద్దలు రెండు ప్రభుత్వాలని కలిసి అవార్డుల ఫంక్షన్ చేయమని, కళాకారులని ప్రోత్సహించామని కోరారు. వాటికి సానుకూలంగానే స్పందించినా ఇప్పటి వరకు ఆచరణలో పెట్టలేదు.

    దీంతో, చిరంజీవి మరోసారి ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల తీరును విమర్శించారు. లేటెస్ట్ గా ఆదివారం రోజున సంతోషం అవార్డుల వేడుక జ‌రిగింది. ఆ వేడుక‌కి తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి సినిమాటోగ్ర‌ఫీ మినిష్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌, ఇండ‌స్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

    ఈ క్రమంలో చిరు మాట్లాడుతూ " రెండు ద‌శాబ్దాలుగా సంతోషం ప‌త్రిక స్థాపించి దాని పేరుతో అవార్డుల‌ను ఇవ్వ‌డం చాలా గొప్ప విష‌యం. బ‌ల‌మైన కోరిక‌ల ఉంటేనే ఇలాంటి ప‌నుల‌ను చేయ‌గ‌లం. ఇది ఇలాగే కంటిన్యూ చేయాల‌ని కోరుకుంటున్నాను. నిజానికి ఇలాంటి అవార్డు వేడుకలు ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం సినిమా కళాకారులను అవార్డులు అందించి సత్కరించాలి. కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత అటు ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ అవార్డు వేడుకల విషయం మరచిపోయాయి. ఇకపై అయినా ఈ రెండు ప్రభుత్వాలు అలోచించి అవార్డు వేడుకలు నిర్వహిస్తే మంచిది " అన్నారు.

    ఇది కూడా చదవండి : నిర్మాతలతో అలా చేస్తేనే సినిమా ఛాన్సులు వస్తాయా..? భూమిక షాకింగ్ కామెంట్స్..

    చివరి సారిగా 2016లో నంది అవార్డ్స్ ను అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ వాటి ఊసు ఎవరు ఎత్తలేదు. చిరంజీవి అవార్డులు ఇవ్వాలంటూ ప్ర‌స్తావించిన సంతోషం అవార్డుల వేదిక‌పై తెలంగాణ మంత్రి సినిమాటోగ్ర‌పీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ కూడా ఉన్నారు. మ‌రిప్పుడు చిరంజీవి అభ్య‌ర్థ‌న‌ను మినిష్ట‌ర్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారా? ఒక‌రే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌భుత్వ పెద్ద‌లు ప‌ట్టించుకుంటారా? అనేది చూడాలి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, Chiranjeevi, CM KCR, Megastar Chiranjeevi, Telangana, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు