పవన్ కళ్యాణ్‌ను కాపీకొట్టిన మెగాస్టార్ చిరంజీవి...

మెడీ మీద చెయ్యి పెట్టుకుని సీరియస్‌గా చూడడం అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫేమస్ స్టిల్. దాన్ని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసి చూపించారు.

news18-telugu
Updated: November 27, 2019, 2:17 PM IST
పవన్ కళ్యాణ్‌ను కాపీకొట్టిన మెగాస్టార్ చిరంజీవి...
పవన్ కళ్యాణ్, చిరంజీవి
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో సినిమాల్లోకి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సినిమాల్లో నటించేటప్పుడు అప్పుడప్పుడు అన్నయ్య నటనను కాపీ కొట్టి ఉండొచ్చు. తనకు తాను సొంతంగా కొంచెం స్కిల్ డెవలప్‌చేసి ఉండొచ్చు. అయితే, అన్నను తమ్ముడు కాపీ కొడితే ఏమీ అనుకోరు. అయితే, తమ్ముడే సొంతంగా క్రేజ్ సంపాదించుకుని.. ఆ తర్వాత ఆ తమ్ముడి ఫేమస్ డైలాగ్ లేదా స్టిల్స్‌ను అన్న అందరి ముందు ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది. అలాంటి ఘటన జరిగింది. మెగాస్టార్ చిరంజీవి... తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు సిగ్నేచర్ స్టిల్ లాంటి దాన్ని అందరిముందు చేసి చూపించారు.

పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో మెడ మీద చేతులు పెట్టి.. వాలుగా చూస్తుంటే.. ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. ధియేటర్లలో ఈలలు, గోలలు సాధారణం. అయితే, చిరంజీవి కూడా అలాగే చేశారు. మెడ మీద చేతులు పెట్టుకుని అచ్చం పవన్ కళ్యాణ్ చేసినట్టే చేశారు. నిఖిల్ హీరోగా చేసిన అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌‌లో ఈ మెగా సీన్ చోటుచేసుకుంది. ఈ సినిమాలో ప్రఖ్యాత విప్లవకారుడు చెగువేరా గురించి ఓ పాట ఉంటుంది. శంకర్‌మహదేవన్ ఈ పాట పాడారు. సినిమాలో ఆ పాట చూస్తున్నంత సేపు తనకు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నాడంటూ చిరంజీవి మెడ మీద చేతులు పెట్టుకుని.. అచ్చం పవర్ స్టార్ చేసినట్టే చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 27, 2019, 2:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading