అమితాబ్ బచ్చన్‌తో జ్ఞాపకాలను పంచుకున్న చిరంజీవి కూతురు సుస్మిత..

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత.. కేవలం చిరంజీవి పెద్ద కూతురుగానే కాకుండా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఓల్డ్ స్టూడెంట్‌. తాజాగా సుస్మిత..అమితాబ్‌ బచ్చన్‌కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఈ సందర్భంగా బిగ్‌బీతో పనిచేసిన అనుభవాన్ని ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా గుర్తు చేసుకున్నారు.

news18-telugu
Updated: September 15, 2019, 6:49 PM IST
అమితాబ్ బచ్చన్‌తో జ్ఞాపకాలను పంచుకున్న చిరంజీవి కూతురు సుస్మిత..
అమితాబ్ బచ్చన్‌తో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత (instagram/Photos)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత.. కేవలం చిరంజీవి పెద్ద కూతురుగానే కాకుండా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఓల్డ్ స్టూడెంట్‌. ఇపుడు సుస్మిత తాను ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకున్న చదువు తన తండ్రి నటించిన సినిమాలకు బాగానే ఉపయోగపడుతోంది. సుస్మిత తన తండ్రి హీరోగా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. తాజాగా తన తండ్రి చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా మరోసారి తన పనితనాన్నిచూపించింది. ఈ సందర్భంగా సుస్మిత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమితాబ్ బచ్చన్‌తో దిగిన ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. నేను డిజైన్ చేసిన దుస్తుల విషయంలో లెజెండ్ అమితాబ్ తనను ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బిగ్‌బీ తో పనిచేసిన ఆ  జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. సిల్వర్ స్క్రీన్ పై మిమ్మల్ని చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్ చేసింది మెగా స్టార్ పెద్ద  కూతురు సుస్మిత.
చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువైన గోసాయి వెంకన్న పాత్రలో నటించారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మించాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.
First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading