HOME »NEWS »MOVIE »mega star chiranjeevi acharya set to create pan india record mhn

Meaga Star Chiranjeevi - Aacharya: 'ఆచార్య'తో మెగాస్టార్‌ ప్యాన్ ఇండియా రికార్డ్

Meaga Star Chiranjeevi - Aacharya: 'ఆచార్య'తో మెగాస్టార్‌ ప్యాన్ ఇండియా రికార్డ్
Mega Star Chiranjeevi Acharya set to create Pan India record

Meaga Star Chiranjeevi - Aacharya: మెగాస్టార్‌ చిరంజీవి 'ఆచార్య' సినిమా కోసం వేసిన సెట్‌ ప్యాన్‌ ఇండియాలో వేసిన భారీ సెట్‌ అని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం 'ఆచార్య' ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదలకు ముందే ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఓ రికార్డ్‌ను క్రియేట్‌ చేసింది. ఇంతకీ ఈ సినిమా క్రియేట్‌ చేసిన రికార్డ్‌ ఏంటో తెలుసా? మేకింగ్‌ పరంగా.. ఈ సినిమా కోసం భారీ టెంపుల్‌ సెట్‌ను రూపొందించారు. చిన్నా చితకా ఆలయం సెట్‌ కాదు. ఆచార్య సినిమా కోసం హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన కోకా పేటలో 20 ఏకరాల్లో భారీ గుడి సెట్‌ను వేశారు. ఓ గుడి సెట్‌ను ఇంత పెద్ద ప్రాంతంలో క్రియేట్‌ చేయడం ఇండియా సినీ పరిశ్రమలోనే ఇదే తొలిసారి అని అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం ఈ సెట్‌లో చిరంజీవిపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణ ఈ నెల 10వ తేదీతో పూర్తవుతుంది. ఇక రామ్‌చరణ్ సహా ఇతర నటీనటులపై కూడా ఇదే సెట్‌లో సన్నివేశాలను చిత్రీకరిస్తారట.

    ప్రస్తుతం రామ్‌చరణ్‌ కోవిడ్‌ బారిన పడటంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కొన్నిరోజుల్లోనే చరణ్‌ 'ఆచార్య' చిత్రీకరణలో పాల్గొంటారు. దాదాపు నెలరోజుల పాటు చరణ్‌ ఈ సినిమా షూట్‌లో భాగం అవుతున్నారు. ఫిబ్రవరిలో మిగిలిన పార్ట్‌ను చిత్రీకరించేలా ప్లాన్‌ చేసేశారట. ఎలాంటి అవాంతరాలు లేకపోతే మార్చి నెలకంతా 'ఆచార్య' షూటింగ్‌ పూర్తవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేలా నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నారు.



    కమర్షియల్‌ అంశాలను మిక్స్‌ చేసి సినిమాను మెసేజ్‌ ఓరియెంటెడ్‌గా చిత్రీకరించడంలో దిట్ట అయిన డైరెక్టర్‌ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. రామ్‌చరణ్‌ జోడీగా పూజా హెగ్డే నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖలో అవినీతిని ప్రశ్నించేలా సినిమా కథాంశం ఉంటుందట. ఇందులో చిరంజీవి మాజీ నక్సలైట్‌ పాత్రలో కనిపిస్తే.. రామ్‌చరణ్‌ నక్సలైట్‌ పాత్రలో కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. సోనూసూద్‌ విలన్‌గా నటిస్తున్నాడు.
    Published by:Anil
    First published:January 02, 2021, 10:50 IST