Home /News /movies /

MEGA PRODUCER VYJAYANTHI MOVIES C ASWANI DUTT DONATES 5 LAKH RUPEES TO CORONA CRISIS CHARITY TA

కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ విరాళం..

వైజయంతి మూవీస్ అధినేత సి.అశ్వినీదత్ విరాళం (Twitter/Photo)

వైజయంతి మూవీస్ అధినేత సి.అశ్వినీదత్ విరాళం (Twitter/Photo)

Vyjayanthi Movies | సమాజం నుండి మనం తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. తాజాగా ప్రముఖ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ తన వంతు సాయం అందించారు.

సమాజం నుండి మనం తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. ఇపుడు మన సెలబ్రిటీలు అదే చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నారు. వీరిలో హీరోలతో పాటు దర్శకులు, నిర్మాతలు కూడా ఉన్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెర్ రూ. 10 లక్షల చెప్పున మొత్తం రూ. 20 లక్షల విరాళం అందజేసారు. తాజాగా ఈయన కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం మరో రూ. 5 లక్షల సాయం చేస్తున్నట్టు ప్రకటించారు.


సి.అశ్వనీదత్ విషయానికొస్తే..తెలుగులో అగ్ర కథానాయకులందరితో సినిమాలు చేసిన టాప్ ప్రొడ్యూసర్‌గా సి. అశ్వనీదత్ పేరు ముందుగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈయన ప్రభాస్.. హీరోగా ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Ap government, Ashwini Dutt, Telangana Government, Telugu Cinema, Tollywood, Vyjayanthi Movies

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు