MEGA PRODUCER DIL RAJU QUEUED SENSATIONAL PAN INDIAN PROJECTS WITH RAM CHARAN PRABHAS THALAPATHY VIJAY VERY SOON PK
Dil Raju: టాప్ ఫామ్‌లోకి వచ్చిన దిల్ రాజు.. లైన్లో మెగా కాంబినేషన్స్..
దిల్ రాజు (Dil Raju)
Dil Raju: దిల్ రాజు (Dil Raju)కు తెలుగులో హీరో కంటే ఎక్కువ ఇమేజ్ ఉంది. ఈయన బ్యానర్ నుంచి సినిమాలు వస్తున్నాయంటే క్రేజ్ మరోలా ఉంటుంది. కొన్ని రోజులుగా చిన్న సినిమాలతో వస్తున్న దిల్ రాజు.. ఇప్పుడు ఒక్కసారిగా భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. రామ్ చరణ్ (Ram Charan),ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్ (Allu Arjun), విజయ్ (Vijay) లాంటి హీరోలను లైన్లో పెడుతున్నాడు.
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ముందు వరసలో ఉంటాడు. అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి నిర్మాతలు అప్పుడప్పుడూ సినిమాలు నిర్మిస్తుంటారు. వాళ్ల నిర్మాణ సంస్థల నుంచి భారీ బడ్జెట్ సినిమాలు రావాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. కానీ దిల్ రాజు మాత్రం అలా కాదు. ఓ వైపు చిన్న సినిమాలు చేస్తూనే.. మరోవైపు భారీ సినిమాలు కూడా నిర్మిస్తుంటాడు. కొన్ని రోజులుగా చిన్న సినిమాలతో వస్తున్న దిల్ రాజు.. ఇప్పుడు మళ్లీ పూర్తిగా కమ్ బ్యాక్ అయిపోయాడు. వరసగా భారీ సినిమాలు నిర్మిస్తున్నాడు. పైగా పాన్ ఇండియన్ సినిమాలతో రచ్చ చేయాలని చూస్తున్నాడు దిల్ రాజు. దీనికి తగ్గట్లుగానే తన బ్యానర్లో భారీ సినిమాలు తెరపైకి తీసుకొస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్తో వస్తున్నాడు దిల్ రాజు. ఈ చిత్రం ఎప్రిల్ 9న భారీ స్థాయిలో విడుదల కానుంది. మొన్నటికి మొన్న రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో సినిమా ప్రకటించాడు. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో నిర్మిస్తున్నాడు దిల్ రాజు. దీనికోసం 130 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు దిల్ రాజు. ప్రస్తుతం ఈ కాంబోలో సలార్ సినిమా వస్తుంది. దీని షూటింగ్ కూడా 30 శాతం పూర్తయింది. 120 కోట్లతో ఈ సినిమాను కెజియఫ్ నిర్మాతలే నిర్మిస్తున్నారు.
రామ్ చరణ్ శంకర్ (Ram Charan Shankar)
ప్రభాస్ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టాడు దిల్ రాజు. ఇప్పటికే జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు దిల్ రాజు. అక్కడ అల్లు అరవింద్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు రాజు. గౌతమ్ తిన్ననూరినే అక్కడ కూడా దర్శకుడు. షాహిద్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అల్లు అర్జున్ సినిమా కూడా చాలా రోజులుగా లైన్లోనే ఉంది. ఇప్పటికే ఆయనతో ఆర్య, పరుగు, డిజే సినిమాలు నిర్మించాడు దిల్ రాజు. ఇప్పుడు 4వ సారి అల్లు వారసుడితో దిల్ రాజు సినిమా నిర్మించబోతున్నాడని తెలుస్తుంది.
ప్రశాంత్ ప్రశాంత్ నీల్ దిల్ రాజు (Dil raju Prashant Neel Prabhas)
ఇన్ని సినిమాలు లైన్లో ఉండగానే తాజాగా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ లైన్లోకి తీసుకొస్తున్నాడు దిల్ రాజు. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమా నిర్మించాలని చూస్తున్నాడు దిల్ రాజు. దీనికోసం చర్చలు కూడా జరుపుతున్నాడు దిల్ రాజు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ రానుంది. ఏదేమైనా కూడా ఒకేసారి ఇన్ని భారీ సినిమాలను నిర్మిస్తుండటం అనేది చిన్న విషయం కాదు. అది కేవలం దిల్ రాజుకు మాత్రమే సాధ్యమవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.