MEGA PRODUCER ALLU ARAVIND AHA OTT READY TO ENTRY INTO TAMIL HERE ARE THE DETAILS TA
Allu Aravind : అల్లు అరవింద్ బిగ్ స్కెచ్.. తమిళంలో కూడా ’ఆహా’ తో ఎంట్రీ ఇవ్వనున్న అగ్ర నిర్మాత..
తమిళంలో అల్లు అరవింద్ ఆహా (File/Photo)
Allu Aravind : అల్లు అరవింద్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. నటుడిగా కంటే నిర్మాతగానే బాగానే పాపులర్ అయ్యారు. తాజాగా ఈయన ఆహా ఓటీటీని తమిళంలో కూడా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.
Allu Aravind : అల్లు అరవింద్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. నటుడిగా కంటే నిర్మాతగానే బాగానే పాపులర్ అయ్యారు. ముఖ్యంగా చిరంజీవి మెగాస్టార్ కావడం వెనక.. అల్లు అరవింద్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉందని అందరు చెప్పుకుంటూ ఉంటారు. అల్లు అరవింద్ ప్లానింగ్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుందనే పేరు వచ్చింది. ఇక ఆహా అంటూ తెలుగు కంటెంట్‌తో మంచి విజయం అందుకున్నారు. ఇక ఇప్పటి వరకు ఈయన నిర్మించిన సినిమాల్లో దాదాపు 90 శాతం విజయాలున్నాయంటే అల్లు అరవింద్ జడ్జిమెంట్ ఏంటో అర్థమవుతుంది. ఈయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వేల మందికి ఉపాదిని కల్పిస్తున్నాయి. ఈయన తీసుకునే కొన్ని నిర్ణయాలు ఊహాతీతంగా ఉంటాయి.
ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి వెల్ విషర్‌గా ఉన్న అల్లు అరవింద్ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటూనే ఆహా ఓటీటీ అంటూ తెలుగు కంటెంట్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. తన కాంపౌండ్‌లో చిరంజీవి సహా ఎంతో మంది మెగా హీరోలన్న వాళ్లను కాదని.. కలలో సైతం ఎవరు ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అంటూ ఓ టాక్ షోను ప్లాన్ చేయడమే కాదు. ఈ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్‌కు మెగా ఫ్యామిలీకి ‘మా’ ఎలక్షన్స్ సందర్భంగా సవాల్ విసిరిన మోహన్ బాబు ఫస్ట్ గెస్ట్‌గా వచ్చేలా చేయడంలో సక్సెస్ సాధించారు అల్లు అరవింద్.
ఇప్పటి వరకు ఈ షోలో మోహన్ బాబుతో పాటు నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో పాటు అఖండ టీమ్ మెంబర్స్‌తో పాటు .. రవితేజ, గోపీచంద్ మలినేని, పుష్ప మూవీ యూనిట్ సభ్యులైన అల్లు అర్జున్, సుకుమార్, రష్మికతో పాటు రానా ఈ షోలో పార్టిసిపేట్ చేసారు. ఈ రోజు ’లైగర్’ మూావీ టీమ్ విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, చార్మి హాజరు కానున్నారు. ఈ షో IMDB ర్యాకింగ్‌లో 9.7 రేటింగ్‌తో మన దేశంలోనే నంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. మొత్తంగా బాలయ్య టాక్ షోతో ఆహాకు సబ్స్క్రైబర్స్ అనూహ్యంగా పెరిగారు.
ముఖ్యంగా గతేడాది లాక్డౌన్ సమయంలో ఇండస్ట్రీ అంతా స్థంభించిపోతే అల్లు అరవింద్ మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఎంతోమంది సినీ కార్మికులకు లాభం చేకూర్చారు. ఆహా ఓటిటి సంస్థను స్థాపించి అందులో తెలుగు కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. అప్పట్లో ఆహాను 100 పర్సెంట్ తెలుగు కంటెంట్ అంటే కొంతమంది నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు నవ్విన వాళ్లతోనే ఆహా అనిపిస్తున్నారు అల్లు అరవింద్. తెలుగు వారితో ఆహా అనిపించిన అల్లు అరవింద్.. ఇపుడు తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడింది. మరి తెలుగు ప్రేక్షకుల మాదిరే తమిళ ప్రేక్షకుల మనుసును ఆహా దోచుకుంటుందా లేదా అనేది చూడాలి.
అల్లు అరవింద్ ఇదంతా ఎందుకు చేసారు అనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే.. ఎంతోమంది ఎన్నో కోట్ల ఆశలతో సినిమాలు చేసి.. చేతిలోనే ఉంచుకుని విడుదల చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు సాయం చేయడానికే అల్లు అరవింద్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రయత్నం వందశాతం కాదు 200 శాతం సక్సెస్ అయింది. సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీని ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లడంలో అల్లు అరవింద్ ముందే ఉంటారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.