Home /News /movies /

Varun Tej - Ghani: వెనక్కి తగ్గుతున్న మెగాప్రిన్స్ వరుణ్ తేజ్.. ఎందుకో తెలుసా?

Varun Tej - Ghani: వెనక్కి తగ్గుతున్న మెగాప్రిన్స్ వరుణ్ తేజ్.. ఎందుకో తెలుసా?

Mega Prince Varun Tej latest movie Ghani backs out and thats the reason

Mega Prince Varun Tej latest movie Ghani backs out and thats the reason

Varun Tej - Ghani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గని’ చిత్రాన్ని జూలై 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు విడుదల తేది విషయంపై నిర్మాతలు మరోసారి ఆలోచనలు పడ్డారట. అందుకు కారణలేంటో తెలుసా..

ఇంకా చదవండి ...
    ఎఫ్‌2, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌.. రెండు వ‌రుస హిట్స్ త‌ర్వాత మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ ఈ ఏడాది మ‌రో రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఎఫ్‌2 ఫ్రాంచైజీ ఎఫ్ 3తో పాటు గ‌ని సినిమాను కూడా ఈ ఏడాదిలో విడుద‌ల చేయాల‌ని వ‌రుణ్‌తేజ్ భావించాడు. ముందుగా ఈ ఏడాది జూలై 30న గ‌ని సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. కానీ తీరా ఇప్పుడు ఆ డేట్‌కు ప్రేక్ష‌కుల ముందుకు రావాలా? వద్దా? అనే ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. అందుకు కార‌ణం. సినిమాల్లో నెల‌కొన్న భారీ పోటీయే కారణం. ఎందుకంటే జూలై 16 నుంచి ఆగ‌స్ట్ 13 వ‌ర‌కు రెండేసి వారాల గ్యాప్‌లో మూడు ప్యాన్ ఇండియా సినిమాలు వ‌స్తున్నాయి. అందులో వ‌రుణ్‌తేజ్ ప్ర‌క‌టించిన జూలై 30నాటికే ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా విడుద‌ల‌వుతుంది.

    ఇంత భారీ పోటీలో రావ‌డం సాహ‌స‌మే అవుతుంది. వ‌చ్చిన సినిమాను ప‌ట్టించుకుంటారా? అనేది ఆలోచించాలి. ఇవ‌న్నీ దాటి థియేట‌ర్స్‌లోకి రావాల‌నుకున్నా, థియేటర్స్ దొరుకుతాయా! అనేది ఆలోచించాల్సిన విష‌య‌మే. వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకున్న గ‌ని నిర్మాత‌లు సినిమాను వాయిదా వేయాల‌నుకుంటున్నార‌ట‌. ఒక‌వేళ ఆగ‌స్ట్ వ‌ద్దామనుకుంటే ఆ నెల‌లో ఆగ‌స్ట్ 6 త‌ప్ప‌, మ‌రో డేట్ కూడా ఖాళీ లేదు. ఈ త‌రుణంలో వ‌రుణ్‌తేజ్ సినిమా రావ‌డం కూడా క‌ష్ట‌మే అవుతుంది. దీంతో సెప్టెంబ‌ర్‌లో అయినా కుదురుతుందా! అని నిర్మాత‌లు యోచిస్తున్నార‌ట‌.

    మంచి రిలీజ్ డేట్ చూసుకుని గ‌ని సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకుంటున్నారు నిర్మాత‌లు. ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్, బాక్స‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం వ‌రుణ్‌తేజ్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. స‌రైన డేట్‌తో రాక‌పోతే వ‌రుణ్‌తేజ క‌ష్టం, నిర్మాత‌ల వ్య‌యం వృథా పోతుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రి గ‌ని విడుద‌ల తేదిపై నిర్మాత‌లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.
    Published by:Anil
    First published:

    Tags: Ghani Movie, Radhe Shyam, Varun Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు