Home /News /movies /

MEGA PRINCE VARUN TEJ JOINED F3 MOVIE SHOOTING AFTER CORONA AND ANIL RAVIPUDI TWEETED PK

Varun Tej: కరోనా తగ్గిన తర్వాత ‘F3’ షూటింగ్‌లో అడుగు పెట్టిన వరుణ్ తేజ్..

అనిల్ రావిపూడి వరుణ్ తేజ్ (Anil Ravipudi Varun Tej)

అనిల్ రావిపూడి వరుణ్ తేజ్ (Anil Ravipudi Varun Tej)

Varun Tej: వరుణ్ తేజ్ మళ్లీ మేకప్ వేసుకున్నాడు. కొన్ని రోజులుగా క్వారంటైన్ అంటూ ఇంట్లోనే ఉండిపోయిన మెగా ప్రిన్స్ ఎట్టకేలకు మళ్లీ రంగేసుకున్నాడు. ఈయన నటిస్తున్న ఎఫ్ 3 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతుంది.

వరుణ్ తేజ్ మళ్లీ మేకప్ వేసుకున్నాడు. కొన్ని రోజులుగా క్వారంటైన్ అంటూ ఇంట్లోనే ఉండిపోయిన మెగా ప్రిన్స్ ఎట్టకేలకు మళ్లీ రంగేసుకున్నాడు. ఈయన నటిస్తున్న ఎఫ్ 3 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. క్రిస్మస్ సమయంలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. అయితే అదే సమయంలో వరుణ్ తేజ్‌తో పాటు రామ్ చరణ్ కూడా కరోనా బారిన పడ్డాడు. దాంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే క్వారంటైన్ తర్వాత క్షేమంగా బయటికి వచ్చాడు వరుణ్ తేజ్. వచ్చీ రాగానే ఎఫ్ 3 షూటింగ్‌లో అడుగు పెట్టాడు వరుణ్. ఈ సినిమా షూటింగ్‌లో వెంకటేష్ ముందుగానే వచ్చేసాడు. డిసెంబర్ 24న షూటింగ్ మొదలు పెట్టిన రోజే వెంకీ జాయిన్ అయ్యాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం కరోనా కారణంగా ఆగిపోయాడు. ఇప్పుడు ఈయన రావడంతో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఫుల్ ఖుషీ అవుతున్నాడు. వెల్ కమ్ టూ సెట్స్ బ్రదర్.. ఫన్ మళ్లీ మొదలైంది అంటూ వరుణ్ తేజ్‌కు స్వాగతం పలికాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇద్దరూ కూర్చుని నవ్వుతున్న ఫోటోను ట్వీట్ చేసాడు.

varun tej,varun tej twitter,varun tej instagram,varun tej corona positive,varun tej f3 shooting,varun tej joins f3 shooting,telugu cinema,varun tej venkatesh f3 movie,వరుణ్ తేజ్,వెంకటేష్,వరుణ్ తేజ్ షూటింగ్ ఎఫ్3,కరోనా తర్వాత షూటింగ్‌కు వచ్చిన వరుణ్ తేజ్
‘ఎఫ్ 2’ మూవీ పోస్టర్ (F2 poster)


దీనికి వరుణ్ తేజ్ కూడా థ్యాంక్స్ అంటూ స్పందించాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోనే వేగంగా జరుగుతుంది. 2019 సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 దాదాపు 130 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. అందులో షేర్ 72 కోట్లు ఉంది. దిల్ రాజుకు ఈ చిత్రంతో 50 కోట్ల వరకు లాభాలు వచ్చాయి. అప్పట్లో ఎఫ్ 2 కేవలం 30 కోట్లలోపే పూర్తైపోయింది. కానీ ఇప్పుడు ఎఫ్ 3 కోసం మాత్రం దాదాపు 80 కోట్లు ఖర్చు చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం ఏకంగా 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది.


అలాగే వెంకటేష్ 10.. వరుణ్ తేజ్ 8 కోట్ల వరకు తీసుకుంటున్నారు. తమన్నా, మెహ్రీన్ కూడా ఎఫ్ 3 కోసం భారీ పారితోషికమే అందుకుంటున్నారు. రెమ్యునరేషన్స్ రూపంలోనే సగం బడ్జెట్ వెళ్లిపోతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర షూటింగ్‌లోకి వరుణ్ తేజ్ కూడా రావడంతో కాంబినేషన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇది ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ కాదని.. కేవలం ఆ కారెక్టర్స్ మాత్రమే తీసుకుని ఫ్రాంచైజీలా చేస్తున్నామంటున్నాడు అనిల్ రావిపూడి. 2021లోనే సినిమా విడుదల కానుంది. అన్నీ కుదిర్తే దసరాకు విడుదల చేయాలనుకుంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anil Ravipudi, F3 Movie, Telugu Cinema, Tollywood, Varun Tej

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు