Home /News /movies /

MEGA PRINCE VARUN TEJ GHANI MOVIE TEASER RELEASED AND ITS GETTING POSITIVE RESPONSE PK

Varun Tej Ghani teaser: వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ‘గని’ టీజర్ విడుదల..

వరుణ్ తేజ్ గని సినిమా టీజర్ (varun tej ghani movie)

వరుణ్ తేజ్ గని సినిమా టీజర్ (varun tej ghani movie)

Varun Tej Ghani teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej Ghani teaser) హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.

ఇంకా చదవండి ...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. జనవరి 19న ఈయన పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఇందులో బాక్సర్‌గా నటిస్తున్నారు వరుణ్ తేజ్. దీనికోసం బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ప్రొఫెషనల్ బాక్సర్స్‌తో కలిసి సినిమాలో నటిస్తున్నారు వరుణ్ తేజ్.

సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో తమన్నా ఐటం సాంగ్ చేసింది. ఈ మధ్యే విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గని సినిమాతోనే మొదటిసారి నిర్మాతగా మారుతున్నాడు అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ప్రాణం పెట్టేసాడు.

Nani child artist: మహేష్ బాబు ‘నాని’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ‘హీరో’ అయ్యాడు తెలుసా..?


షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఔట్ పుట్ చూసుకుని.. మళ్లీ రీ షూట్స్ కూడా చేస్తున్నారు యూనిట్. బాగా రాలేదు అనుకున్న సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమా కోసం చాలా కష్టపడి బాక్సింగ్ నేర్చుకున్నాడు వరుణ్ తేజ్. ఫిజిక్ విషయంలో కానీ.. బాక్సింగ్ విషయంలో కానీ ఎక్కడా తగ్గేదే లే అంటున్నాడు ఈయన. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.


కచ్చితంగా గని సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకుంటానని ధీమాగా చెప్తున్నాడు ఈయన. మరోవైపు వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కూడా గని సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ రెండో కారెక్టర్ పేరు గని. ఆ పేరునే ఇప్పుడు తన సినిమాకు టైటిల్‌గా పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. అల్లు బాబీ నిర్మాతగా ఉన్నా.. కొడుకుకు అన్ని విధాలుగా వెనకుండి సాయం చేస్తున్నాడు అరవింద్. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే 18 మార్చ్, 2022న విడుదల కానుంది గని.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Telugu Cinema, Tollywood, Varun Tej

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు