Varun Tej - Ghani : దీపావళికి వరుణ్ తేజ్ ‘గని’ మూవీ.. అధికారిక ప్రకటన..

దీపావళి కానుకగా వరుణ్ తేజ్ ‘గని’ మూవీ (Twitter/Photo)

Varun Tej - Ghani :  మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ (Varun Tej) ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ప్రకటించారు.

  • Share this:
    Varun Tej - Ghani :  మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ (Varun Tej) ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యేది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో చిత్రబృందం షూటింగ్‌ను రీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ షెడ్యూల్‌తో క్లైమాక్స్‌తో పాటు షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ కి సంబంధించిన క్లైమాక్స్ ఎపిసోడ్ పిక్చరైజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు పోస్టర్ విడుదల చేసారు. అంటే నవంబర్ 4న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారన్న మాట. మొత్తంగా మెగా హీరోలు.. వరుసగా దసరాకు ఆర్ఆర్ఆర్ సినిమా వస్తోంది. క్రిస్మస్‌కు అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫిక్స్ అయింది. ఇపుడు దీపావళి కానుకగా వరుణ్ తేజ్ ‘గని’ మూవీ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

    వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ కనిపించనుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకి ఆమె పరిచయమవుతోంది. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో నదియా కనిపించనుంది. గని సినిమాను అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


    ఈ సినిమా దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌తో భారీగా తెరకెక్కిస్తున్నారు.  ఇక ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాలి. కానీ కరోనా అన్ని సినిమాలాగే వరుణ్ తేజ్ సినిమా విడుదలపై నీళ్లు చల్లింది. తాజాగా దీవాళి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

    దీవాళి కానుకగా వరుణ్ తేజ్ ‘గని’ మూవీ (Twitter/Photo)


    వరుణ్ తేజ్.. ’గని’  సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’లో కూడా నటిస్తున్నారు. ఎఫ్ 3లో వరుణ్‌కు జంటగా మెహ్రీన్ నటిస్తుండగా.. మరో జంటగా వెంకటేష్ తమన్నాలు నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక తాజాగా వస్తున్న సమచారం మేరకు వరుణ్ మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు టాక్. చిరంజీవి మలయాళ లూసీఫర్ రీమేక్‌లో వరుణ్ తేజ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. విద్యాబాలన్ మరో కీలకపాత్రలోకనిపించనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో చిరంజీవి బాడీగార్డ్ పాత్రలో వరుణ్ కనిపించనున్నారట. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు. ఈ సినిమా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ప్రారంభం కానుందని తెలుస్తోంది.

    ఇవి కూడా చదవండి 

    Cheran : సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. రవితేజ దర్శకుడికి తీవ్ర గాయాలు..

    HBD Kajol : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆర్ఆర్ఆర్ హీరో భార్య కాజోల్ దేవ్‌గణ్ గురించి ఈ నిజాలు తెలుసా..

    Suma Kanakala - Rajeev : వివాదంలో సుమ, రాజీవ్ కనకాల దంపతులు..
    Published by:Kiran Kumar Thanjavur
    First published: