Varun Tej: చనిపోయిన అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన వరుణ్ తేజ్..

వరుణ్ తేజ్ (Varun Tej)

Varun Tej: అభిమానులకు హీరోలంటే ప్రాణం. ఆ అభిమానులు అంటే హీరోలకు కూడా యిష్టం. ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉంటుంది. అభిమానులకు ఏమైనా అయితే హీరోలు కూడా తట్టుకోలేరు. తాజాగా వరుణ్ తేజ్(Varun Tej) అభిమాని ఒకరు కన్నుమూసారు.

  • Share this:
ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు అభిమానులు అంటే ప్రాణం. వాళ్లు లేకపోతే వీళ్లు లేరని బాగా తెలుసు. అందుకే ప్రత్యేకంగా కొందరు అభిమానులను మాత్రం చాలా బాగా చూసుకుంటారు. అలాంటి వాళ్లకు ఏమైనా జరిగితే హీరోలు కూడా తట్టుకోలేరు. ఇప్పుడు వరుణ్ తేజ్ విషయంలో ఇదే జరిగింది. ఈయనను ప్రాణంగా ప్రేమించే ఓ అభిమాని మరణించాడు. ఆ విషయం తెలుసుకున్న మెగా ప్రిన్స్ తల్లడిల్లిపోయాడు. వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా తనవంతు సాయం కూడా చేసాడు. ఈ మధ్య చనిపోయిన తన అభిమాని కుటుంబాన్ని వరుణ్‌ తేజ్‌ ఆదుకున్నాడు. కరీంనగర్‌ జిల్లావాసి అయిన శేఖర్‌‌కు వరుణ్ తేజ్ అంటే చాలా యిష్టం. ఆయన ప్రతీ సినిమా చూసేవాడు. అయితే ఈ మధ్యే ఈయన దురదృష్టవశాత్తూ కన్నుమూసారు. పెద్దదిక్కును కోల్పోవడంతో వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వరుణ్‌ తేజ్‌ వాళ్లకు తన వంతు సాయాన్ని అందించారు.

2 లక్షల రూపాయల చెక్ కుటుంబానికి ఇచ్చారు వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే జులై 18న శేఖర్‌ కుటుంబం వరుణ్ తేజ్‌ను కలిసి 2 లక్షల రూపాయల చెక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్‌ ఫ్యామిలీ వరుణ్‌ తేజ్‌కి ధన్యవాదాలు తెలిపారు. వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఎఫ్‌3, గని చిత్రాల్లో నటిస్తున్నారు. వీటి షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది.
Published by:Praveen Kumar Vadla
First published: