హోమ్ /వార్తలు /సినిమా /

Upasana adopts Lions: సింహాలను దత్తత తీసుకున్న రామ్ చరణ్ భార్య ఉపాసన..

Upasana adopts Lions: సింహాలను దత్తత తీసుకున్న రామ్ చరణ్ భార్య ఉపాసన..

ఉపాసన కొణిదెల సింహాలు దత్తత (Upasana Konidela)

ఉపాసన కొణిదెల సింహాలు దత్తత (Upasana Konidela)

Upasana adopts Lions: రామ్ చరణ్ సతీమణి ఉపాసన (Upasana adopts Lions) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. ఈమె చేసే పనులే ఆమెకు ప్రత్యేక గుర్తింపు సంపాదించి పెట్టాయి. ముఖ్యంగా సమాజ సేవ చేయడంలో ఈమె అందరికంటే ముందుంటారు. మూగ జీవాల రక్షణ విషయంలోనూ ఉపాసన చాలా ఖర్చు చేస్తుంటారు.

ఇంకా చదవండి ...

రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. ఈమె చేసే పనులే ఆమెకు ప్రత్యేక గుర్తింపు సంపాదించి పెట్టాయి. ముఖ్యంగా సమాజ సేవ చేయడంలో ఈమె అందరికంటే ముందుంటారు. మూగ జీవాల రక్షణ విషయంలోనూ ఉపాసన చాలా ఖర్చు చేస్తుంటారు. ఈమె చేసే కొన్ని సహాయ కార్యక్రమాలు చూసి అభిమానులు కూడా ఈమెకు ఫిదా అయిపోతుంటారు. ఇప్పుడు కూడా ఉపాసన ఇలాగే చేసారు. తాజాగా ఈమె రెండు సింహాలను దత్తత తీసుకోవడమే కాకుండా.. వాటి పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజీలో ఫిట్‏నెస్‌తో పాటు వైద్యం గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతూ ఉంటుంది. అలాగే ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణ గురించి సూచనలు ఇస్తూ వీడియోలను పోస్ట్ చేస్తుంటారు ఉప్సీ. జంతువులు, పక్షుల సంరక్షణకు సంబంధించిన విషయంలోనూ అందరికీ జాగ్రత్తలు చెప్తుంటారు ఈమె. తాజాగా ఉపాసన రెండు సింహాలను దత్తత తీసుకున్నారు. హైదరాబాద్‏లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‏లో ఉన్న విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలను ఈమె దత్తత తీసుకున్నారు.

ఈ విషయాన్ని జూ సిబ్బంది అధికారికంగా ప్రకటించారు. ఆ రెండు సింహాలను సంరక్షించే బాధ్యతలను ఉపాసన తీసుకున్నారు. వాటికి అయ్యే ఆహారపు ఖర్చులతో పాటు అన్ని కూడా సంవత్సరం పాటు ఉపాసన కొణిదెల చూసుకోనున్నారు. వీటి కోసం రూ. 2 లక్షల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్.రాజశేఖర్‏కు అందించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాసన మాట్లాడుతూ.. పార్కులోని జంతువుల సంరక్షణ, వాటి ఆరోగ్య పరిస్థితి తనకు ఎంతగానో నచ్చాయని.. ఆకట్టుకున్నాయని చెప్పారు.

Tollywood Villain remuneration: విలన్స్ అని తక్కువ అంచనాలొద్దు.. కోట్ల పారితోషికం అందుకుంటున్న ప్రతినాయకులు వీళ్ళే..


ఈ సందర్భంగా క్యూరేటర్‌తో పాటు అతడి టీమ్ సభ్యులను కూడా అభినందించారు ఉపాసన. జూలో ఉంచిన 2000 జంతువుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు.. జూలో సరైన పరిశుభ్రతను నిర్వహించడంలో సిబ్బంది అంకితభావం తనకు బాగా నచ్చాయని.. జంతువుల కోసం జూ నిర్వహకులు చేస్తున్న సేవకు గుర్తించి ప్రశంసించారు. ఈమె కేవలం సమాజ సేవ మాత్రమే కాదు.. అపోలో హాస్పిటల్ బాధ్యతలు కూడా చూసుకుంటారు ఉపాసన.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Nehru Zoological Park, Ram Charan, Telugu Cinema, Tollywood, Upasana konidela

ఉత్తమ కథలు