MEGA POWER STAR RAM CHARANS RANGASTHALAM MOVIE COMPLETED ONE YEAR TA
ఏడాది పూర్తి చేసుకున్న రామ్ చరణ్ ‘రంగస్థలం’..
ఏడాది పూర్తైన రంగస్థలం సినిమా
‘మగధీర’ తర్వాత సరైన సక్సెస్ లేని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్..సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీతో నటన పరంగా విమర్శకుల ప్రశంసలతో పాటు...కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా ఈ మూవీ విడుదలై ఏడాది పూర్తైవుతుంది.
‘మగధీర’ తర్వాత సరైన సక్సెస్ లేని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్..సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ మూవీతో నటన పరంగా విమర్శకుల ప్రశంసలతో పాటు...కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. సమంత హీరోయిన్గా నటించిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఈ రోజుతో ఏడాది పూర్తైవుతుంది. ఇన్నేళ్ల కెరీర్లో నటనపరంగా రాని పేరు ‘రంగస్థలం’ సినిమాతో సంపాదించుకున్నాడు రామ్ చరణ్.మరోవైపు అతని నుంచి నటన రాబట్టుకోవడంలో దర్శకుడిగా సుకుమార్ సఫలమయ్యాడు.ఇక డిజిటల్ యుగంలో 1980 నాటి స్టోరీతో గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి జనరేషన్‌కు కొత్తగా అనిపించింది. అందుకే ఈసినిమాకు ప్రజలు ఆదరించారు. మరోవైపు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటించిన ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నరేశ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ‘రంగస్థలం’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో పాటు రూ.115 కోట్ల షేర్ రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.
రంగస్థలంకు ఏడాది
ఒక్క ఓవర్సీస్ మార్కెట్లో ఈ మూవీ మూడున్నర మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి 2018 టాలీవుడ్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది.ఇప్పటికే ‘రంగస్థలం’ తమిళం, మలయాళంలో డబ్ చేసారు. తాజాగా రంగస్థలం సినిమాను కన్నడలో ‘రంగస్థల’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కన్నడలో కేజీఎఫ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కన్నడ సినిమాలు వేరే భాషల్లో డబ్ అయినపుడు వేరే భాషల సినిమాలకు కన్నడలో రీమేక్ చేయాలని అక్కడి నిర్మాతల మండలి తీర్మానం చేసింది.
దీంతో దశాబ్దాల తర్వాత కన్నడలో డబ్ అవుతున్న తెలుగు సినిమాగా ‘రంగస్థలం’ రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో ‘మాయా బజార్’ తర్వాత మరో సినిమా ఏది కన్నడలో డబ్ కాలేదు. ఇపుడు చాలా ఏళ్ల తర్వాత రంగస్థలం కన్నడ డబ్బింగ్ ‘రంగస్థల’తో మరో రికార్డును క్రియేట్ చేయబోతుంది. అదే రూట్లో విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాను తెలుగు,తమిళం,మలయాళంతో పాటు కన్నడలో రిలీజ్ చేస్తున్నారు. ఈరకంగా కన్నడలో చాలా రోజుల తర్వాత డబ్బింగ్ సినిమాల రిలీజ్‌కు కూడా రంగస్థలం నాంది పలికింది.మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రంగస్థలం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.