ఈ ఫోటో చూసిన తర్వాత ఇంతకంటే గొప్పగా ఏం చెప్తాం చెప్పండి..? నిజంగానే అక్కడ తండ్రీ కొడుకులున్నారా లేదంటే అన్నాదమ్ములు ఉన్నారా అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి అంతగా మేకోవర్ అయిపోయాడు. ఈయన్ని చూస్తుంటే అసలు 65 ఏళ్ళుంటాయి అని ఎవరైనా అనుకుంటారా..? రానురాను మరింత యంగ్ అయిపోతున్నాడు మెగాస్టార్. తాజాగా వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు చిరు. ఈ క్రమంలోనే సినిమా సినిమాకు ఒక్క లుక్ మార్చేస్తున్నాడు. తాజాగా లూసీఫర్ రీమేక్ కోసం మరోసారి కొత్తగా మారిపోయాడు మెగాస్టార్. ఇదిలా ఉంటే జూన్ 20న ఫాదర్స్ డే సందర్భంగా సినీ ప్రముఖులు అంతా తమ తండ్రులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే చిరుకు తనయుడు రామ్ చరణ్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. అప్పుడే తండ్రితో కలిసి ఓ ఫోటో షేర్ చేసాడు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన క్షణం నుంచి ఈ ఫోటో వైరల్ అవుతుంది.
Time with u is time treasured forever!!
— Ram Charan (@AlwaysRamCharan) June 20, 2021
Happy Father’s Day !!! ❤️@KChiruTweets pic.twitter.com/Stm55as7FW
అందులో చిరు, చరణ్‌ను చూసి అభిమానులు పొంగిపోతున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెగా బ్రదర్స్‌లా ఉన్నారే కానీ ఫాదర్ అండ్ సన్ మాదిరి మాత్రం లేరంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నీతో గడిపిన ప్రతీ నిమిషం కూడా నాకు చాలా విలువైనది.. ఓ నిధి లాంటిది అంటూ నాన్నకు ఫాదర్స్ డే విషెస్ చెప్పాడు చరణ్. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఆచార్యలోనూ ఇదే లుక్ మెయింటేన్ చేస్తున్నాడు రామ్ చరణ్. మరోవైపు చిరంజీవి ఆచార్యతో పాటు లూసీఫర్, వేదాళం రీమేక్‌లతో బిజీగా ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Fathers Day 2021, Ram Charan, Telugu Cinema, Tollywood