చిరంజీవి.. ‘సైరా నరసింహారెడ్డి’ కోసం రామ్ చరణ్ మెగా ప్లాన్..

రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు కేవ‌లం హీరో మాత్ర‌మే కాదు.. నిర్మాత కూడా. ఆయ‌న టెన్ష‌న్స్ ఆయ‌న‌కు ఉంటాయి. పైగా రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తుంది చిన్న సినిమా కూడా కాదు. 200 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి సైరా సినిమా నిర్మిస్తున్నాడు. తాజాగా ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కోసం రామ్ చరణ్ మెగా ప్లాన్ వేసాడు.

news18-telugu
Updated: July 28, 2019, 6:45 PM IST
చిరంజీవి.. ‘సైరా నరసింహారెడ్డి’ కోసం రామ్ చరణ్ మెగా ప్లాన్..
చిరంజీవి, రామ్ చరణ్ (పైల్ ఫోటో)
  • Share this:
రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు కేవ‌లం హీరో మాత్ర‌మే కాదు.. నిర్మాత కూడా. ఆయ‌న టెన్ష‌న్స్ ఆయ‌న‌కు ఉంటాయి. పైగా రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తుంది చిన్న సినిమా కూడా కాదు. 200 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి సైరా సినిమా నిర్మిస్తున్నాడు. దాంతో ఆ సినిమాను ప్రమోట్ చేసే పని కూడా రామ్ చరణ్ పై ఉంది. ఇప్పటికే ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను దసరా కానుకగా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న విడుదల  చేయనున్నట్టు సమాచారం. అఫీషియల్‌గా ప్రకటన రాకపోయినా.. అపుడే ఈ సినిమా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఈసినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచాలనే ఆలోచనలో ఉన్నారు.

Ram Charan to act as Auto Johnny.. Puri Jagannadh planning Chiranjeevi movie with his Son pk.. ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత చిరంజీవి సినిమా చేయాల‌నుకున్న‌పుడు మ‌రో ఆలోచ‌న లేకుండా ఆయ‌న ఎంచుకున్న ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్. ఈ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి సినిమా చేస్తున్నాన‌ని అనౌన్స్ కూడా చేసాడు. chiranjeevi auto johnny,chiranjeevi auto johnny movie,chiranjeevi auto johnny puri jagannadh,chiranjeevi auto johnny ram charan,ram charan twitter,chiranjeevi twitter,puri jagannadh auto johnny movie,puri jagannadh auto johnny movie with ram charan,auto johnny movie,chiranjeevi - puri jagannadh film auto johnny back on track,puri jagannadh auto johnny,puri jagannath to direct auto johnny,auto johnny trailer,chiranjeevi movies,puri jagannath auto johnny movie updates,puri jagannadh to direct auto johnny,telugu cinema,ఆటో జానీ,రామ్ చరణ్ ఆటో జానీ,చిరంజీవి పూరీ జగన్నాథ్ ఆటో జానీ,రౌడీ అల్లుడు ఆటో జానీ,రామ్ చరణ్ పూరీ జగన్నాథ్ ఆటో జానీ,చిరుత పూరీ జగన్నాథ్ రామ్ చరణ్,తెలుగు సినిమా
రామ్ చరణ్ చిరంజీవి


తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఖతార్ వేదికగా ఆగష్టు 15, 16 తేదిల్లో  జరిగే సైమా అవార్డ్స్ ఫంక్షన్ వేదికగా ఈ సినిమాను ట్రైలర్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అపుడు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తే.. అందరికీ రీచ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్,మలయాళం, కన్నడలో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. మరి ఈ  సినిమాతో రామ్ చరణ్.. నిర్మాతగా తన తండ్రి చిరంజీవి మరో మెగా హిట్ అందిస్తాడా లేదా అనేది చూడాలి.

 
First published: July 28, 2019, 6:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading